కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వచ్చినా వ్యాక్సిన్ ఎవరికి ముందు ఇవ్వాలో ఇప్పటికే స్పష్టమైన ప్రణాళికలను తయారు చేసింది. కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వచ్చినా తొలి డోస్ ను ఆరోగ్య కార్యకర్తలకు ఇవ్వనుంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ ఏడాది వ్యాక్సిన్ అందుబాటులోకి రాదని వచ్చే ఏడాది మొదట్లో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే భారతదేశంలో ఉన్న ఆరోగ్య కార్యకర్తలకు సంబంధించిన డేటాను సేకరించింది. అధికారులకు ఇప్పటికే దేశంలో 92.5 శాతం ప్రభుత్వ ఆస్పత్రులకు సంబంధించిన సమాచారంతో పాటు 56 శాతం ప్రైవేట్ ఆస్పత్రులకు సంబంధించిన సమాచారం చేరింది. దేశంలోని ఆరోగ్య కార్యకర్తలంతా కోటి మంది ఉండగా వాళ్లందరికీ కరోనా వ్యాక్సిన్ అందనుందని సమాచారం.
కేంద్ర ప్రభుత్వం వచ్చే సంవత్సరం జులై నెలలోపు దేశంలోని యువత మినహా మిగతా వాళ్లలో 20 కోట్ల నుంచి 25 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చే విధంగా ప్రణాళికలను రచిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు వేరువేరు కేటగిరీలలో పని చేస్తున్న హెల్త్ వర్కర్లకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే సమర్పించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ వర్గాలు ఆరోగ్య కార్యకర్తలందరికీ ఒకేసారి వ్యాక్సిన్ ను ఇస్తామని చెబుతున్నాయి.
ఆశా వర్కర్లు, నర్సులు, అల్లోపతి, ఆయుష్ డాక్టర్లు, ఏ.ఎన్.ఎంలకు మొదట కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఎంత త్వరగా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే అంత త్వరగా వైరస్ ను కట్టడి చేయడం సాధ్యమవుతుందని వైద్యులు, శాస్త్రవేత్తలు చెబుతూ ఉండటం గమనార్హం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…