కేంద్రం సంచలన నిర్ణయం.. వ్యాక్సిన్ మొదట వాళ్లకు మాత్రమే..?

0
198

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వచ్చినా వ్యాక్సిన్ ఎవరికి ముందు ఇవ్వాలో ఇప్పటికే స్పష్టమైన ప్రణాళికలను తయారు చేసింది. కేంద్ర ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వచ్చినా తొలి డోస్ ను ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల‌కు ఇవ్వనుంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ ఏడాది వ్యాక్సిన్ అందుబాటులోకి రాదని వచ్చే ఏడాది మొదట్లో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే భారతదేశంలో ఉన్న ఆరోగ్య కార్యకర్తలకు సంబంధించిన డేటాను సేకరించింది. అధికారులకు ఇప్పటికే దేశంలో 92.5 శాతం ప్రభుత్వ ఆస్పత్రులకు సంబంధించిన సమాచారంతో పాటు 56 శాతం ప్రైవేట్ ఆస్పత్రులకు సంబంధించిన సమాచారం చేరింది. దేశంలోని ఆరోగ్య కార్యకర్తలంతా కోటి మంది ఉండగా వాళ్లందరికీ కరోనా వ్యాక్సిన్ అందనుందని సమాచారం.

కేంద్ర ప్రభుత్వం వచ్చే సంవత్సరం జులై నెలలోపు దేశంలోని యువత మినహా మిగతా వాళ్లలో 20 కోట్ల నుంచి 25 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చే విధంగా ప్రణాళికలను రచిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు వేరువేరు కేటగిరీలలో పని చేస్తున్న హెల్త్ వర్కర్లకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే సమర్పించినట్టు తెలుస్తోంది. ప్ర‌భుత్వ వ‌ర్గాలు ఆరోగ్య కార్యకర్తలందరికీ ఒకేసారి వ్యాక్సిన్ ను ఇస్తామని చెబుతున్నాయి.

ఆశా వర్కర్లు, నర్సులు, అల్లోపతి, ఆయుష్ డాక్టర్లు, ఏ.ఎన్.ఎంలకు మొదట కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఎంత త్వరగా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే అంత త్వరగా వైరస్ ను కట్టడి చేయడం సాధ్యమవుతుందని వైద్యులు, శాస్త్రవేత్తలు చెబుతూ ఉండటం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here