Featured

అది మన వైరస్ కాదు.. తప్పుడు ప్రచారం చేయద్దంటూ కేంద్రం ఫైర్!

Published

on

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎంతో వేగంగా వ్యాపిస్తున్న B.1.617 కరోనా​ వేరియంట్ నిత్యం ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటుంది. అయితే భారత్లో వ్యాపిస్తున్న అటువంటి ఈ వేరియంట్  ‘ఇండియన్​ వేరియంట్’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్​ఓ) పేర్కొన్నట్లు ఇటీవలి కాలంలో మీడియాలో అనేక కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే కేంద్ర ఆరోగ్య శాఖ ఇండియాలో వేగంగా వ్యాప్తి చెందుతున్నటువంటి.B.1.617 అనేది ‘ఇండియన్​ వేరియంట్’ అని చెప్పేందుకు ఎక్కడా ఆధారాలు లేవని,ఈ విధమైనటువంటి తప్పుడు ప్రచారాలను చేస్తూ ప్రజలను మరింత భయాందోళనకు గురి చేయొద్దని ఆరోగ్యశాఖ పలు మీడియా సంస్థలను హెచ్చరించింది.

తాజాగా, WHO విడుదల చేసిన 32 పేజీల డాక్యుమెంట్​లో కూడా ఈ వేరియంట్​ ‘ఇండియా’కు చెందినట్లు ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేసింది. వైరస్ వివిధ రూపాలను అవి కనిపించిన దేశాల పేర్లతో కాకుండా, వాటిని శాస్త్రీయ నామంతో గుర్తిస్తామని ఇదివరకే ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన విషయాన్ని గుర్తు చేసింది. భారతదేశంలో కనిపించినటువంటి ఈ వేరియంట్ ఇప్పటికే 44 దేశాలలో కూడా కనిపించిందని కేంద్ర ఆరోగ్య సంస్థ వెల్లడించింద

B.1.617 వేరియంట్ తొలుత బ్రిటన్​, బ్రెజిల్​, దక్షిణాఫ్రికాల్లో గుర్తించినట్లు తెలిపింది. ఈ వేరియంట్ ఒరిజినల్ దానికన్నా ఇండియాలో వేగంగా వ్యాపించడం వల్లే దీనిని ఆందోళనకరమైన వేరియంట్ జాబితాలో చేర్చినట్లు కేంద్ర ఆరోగ్య సంస్థ తెలిపింది.ప్రస్తుతం ఇండియాలో చేస్తున్నటువంటి ఈ వేరియంట్ ఎంతో శక్తివంతమైనదని, ఈ వేరియంట్ యాంటీబాడీస్​ను తీవ్రంగా దెబ్బతీస్తున్నట్లు డబ్ల్యూహెచ్​ఓ స్పష్టతనిచ్చింది. ఈ క్రమంలోనే ఎంతోమంది ఈ వైరస్ బారిన పడి చనిపోతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.

Advertisement

Trending

Exit mobile version