అప్పుల భారంతో పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే.. అయితే తాజగా పాకిస్తాన్ కు మరో గట్టి షాక్ ఇచ్చింది డ్రాగన్ చైనా. అసలు విషయం ఏమిటంటే.. సీపెక్ కు సంబంధించి 31 బిలియన్ డాలర్ల అప్పులను రీస్ట్రక్చర్ చేయాలంటూ చైనా ను పాకిస్తాన్ కోరింది.

అయితే పాకిస్తాన్ చేసిన రీస్ట్రక్చర్ రిక్వస్ట్ ను రిక్వెస్ట్ ను పరిశీలించిన చైనా దీనిపై స్పందిస్తూ 31 బిలియన్ డాలర్ల అప్పులను రీస్ట్రక్చర్ చేయడానికి అంగీకరించడం జరగదని తెల్చ్చి చెప్పింది. తమ రిక్వెస్ట్ ను చైనా తిరస్కరించడంపై షాక్ లో ఉంది పాకిస్తాన్. మరోవైపు పాకిస్తాన్ అప్పులు 2020 డిసెంబర్ నాటికి 294 బిలియన్ డాలర్లకు చేరింది. ఆ మొత్తం పాకిస్తాన్ జీడీపీలో 109 శాతం గా ఉందని తెలుస్తోంది.
































