Chaitanya Jonnalagadda : మెగాస్టార్ చిరంజీవి కష్టపడి పైకి వచ్చిన హీరో. టాలీవుడ్ లో ఎంతో మంది నేటితరం నటీ నటులకు స్ఫూర్తి. అలాంటి చిరంజీవి ఇంటినుండి వారసులుగా ఇండస్ట్రీ లోకి వచ్చిన వారు చాలా మందే ఉన్నారు. ఒక రకంగా మెగా ఫ్యామిలీ టాలీవుడ్ కి హీరోలను అందిస్తూనే ఉంది అనొచ్చు. చిరంజీవి తరువాత తమ్ముడు నాగబాబు, ఇక ఆ తరువాత పవన్ కళ్యాణ్ సినిమాల్లో అడుగుపెట్టారు. నాగబాబు సంగతి పక్కన పెడితే పవన్ సంగతి చెప్పకర్లేదు. చిరంజీవి స్టార్ డమ్ తో వచ్చినా తనకంటూ సొంత ఫ్యాన్ బేస్ తో పవన్ కళ్యాణ్ హీరో గా ఉన్నారు. ఇక ఆ తరువాత చిరంజీవి అల్లుడు అల్లు అర్జున్ హీరోగా వచ్చాడు. బన్నీ కూడా మెగా కాంపౌండ్ నుండి వచ్చినా సొంత ఇమేజ్ తో దూసుకెళ్తున్నాడు.

నాగబాబు అల్లుడు హీరో గా ఎంట్రీ…
ఇక చిరంజీవి కొడుకు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, చరణ్ తన డాన్స్, నటనతో టాప్ హీరోల్లో ఒకడిగా ఉన్నాడు. నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ కూడా హీరోగా విభిన్నమైన చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక చిరు మేనల్లుళ్ళు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లు కూడా హీరోలుగా సినిమాలు తీస్తూ కెరీర్ లో సక్సెస్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక చిరు కూతురు శ్రీజ రెండవ భర్త కళ్యాణ్ దేవ్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇక వీళ్లంతా ఒక ఎత్తు అయితే నాగబాబు కూతురు నిహారిక కూడా సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

కొన్ని సినిమాలు తీసినా అవి పెద్దగా ఆడకపోవడంతో ఇక పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. అయితే ఇపుడు ఆమె భర్త హీరోగా వస్తాడు అంటూ రూమర్స్ వస్తున్నాయి. హీరో గా ఉండాల్సిన లక్షణాలన్నీ ఉండి చూడ్డానికి చక్కగా ఉండే చైతన్య కూడా హీరోగా బాగుంటాడు. ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉండే చైతూ భార్య నిహారిక తో కలిసి వెబ్ సిరీస్ ల నిర్మాణం లో భాగస్వామ్యం అయ్యాడు. దీంతో అందరూ త్వరలో చైతన్య హీరోగా వస్తాడు అంటూ అనుకున్నారు. అయితే సినిమాల్లో యాక్ట్ చేయడం చైతన్య కి ఇష్టం లేదట.. తనకున్న వ్యాపార పనుల్లోనే తనకు సంతృప్తి దొరుకుతోందని సినిమా వర్గాలతో అన్నారట. దీంతో సినిమా ఎంట్రీ పై చైతన్య క్లారిటి ఇచ్చినట్లయింది.



























