Chandaka Govindh : ఏ నిమిషానికి ఏమి జరుగునో అన్నట్లుగా అంతవరకు తన సహచర నావి ఉద్యోగులతో సరదాగా ఉన్న నావి కమాండర్ చందక గోవింద్ మరణించి కుటుంబానికి తీరని లోటును మిగిల్చారు. చీపురుపల్లికి చెందిన నావి కమాండర్ చందక గోవింద్ ప్యారాచూట్ ట్రైనింగ్ లో ఆక్సిడెంట్ లో మరణించారు. విజయనగరం జిల్లా పర్ల గ్రామానికి చెందిన గోవింద్ నావి ఆఫీసర్ గా విశాఖ నావి లో సేవలందిస్తున్నారు. అందులో భాగంగానే ప్యారాచూట్ సహాయంతో ఎగిరే శిక్షణ అందుకుంటున్న ఆయన ప్యారాచూట్ సకాలంలో ఓపన్ అవ్వకపోవడం వల్ల పై నుండి కిందపడి బలమైన గాయాలు తగిలి మరణించారు.

సెకండ్ స్టేజి లో జరిగిన ప్రమాదం…
గోవింద్ గారితో మరికొంతమంది సహచర నావి ఉద్యోగులు హెలికాప్టర్ సహాయంతో గాలిలోకి దూకి ఒకరినొకరు చేతులతో పట్టుకుని గాలిలో ఉన్నారు. మొదటి స్టేజి వరకూ అంతా బాగానే ఉన్నా రెండో స్టేజిలో చందక గోవింద్ చేయి పట్టుకుని ఉన్న సహచర ఉద్యోగి తన చేయి వదిలేసాక గోవింద్ తన ప్యారాచూట్ సహాయంతో కిందకి దిగాల్సి ఉండగా అది ఓపెన్ కాకపోవడంతో అందరూ చూస్తుండగానే గోవింద్ చాలా ఫాస్ట్ గా నేల మీదకు పడిపోయారు. ఎత్తు నుండి నేల మీదకు పడటం వల్ల గోవింద్ కి తీవ్ర గాయలు అయ్యాయి.

ఈ సంఘటన కోల్కత్తా సమీపంలో జరుగగా ప్రమాదం జరిగిన వెంటనే గోవింద్ ను బరజోరా ఆసుపత్రికి తరలించినా అప్పటికే అతను మరణించాడని వైద్యులు తెలిపారు. విషయం తెలిసాక పర్ల గ్రామం విషాదంలో మునిగిపోయింది. ఇక గోవింద్ తల్లిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. నేడు సాయంత్రం ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి మృత దేహాన్ని సొంతూరుకి తరలించనున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను నేవీ విడుదల చేసింది. అలాగే ఈ ఘటన మీద దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించింది.
































