Chandhra Hass: ఇండస్ట్రీలోకి కొత్త హీరోలు రోజూ వస్తూనే ఉంటారు. కొంతమంది మంచి అవకాశాలతో ఒక్కో అడుగు వేసుకుంటూ స్టార్ డమ్ తెచ్చుకుంటారు. మరి కొంతమంది మొదటి సినిమాతోనే బాగా పాపులర్ అవుతారు. ఇక చంద్రహాస్ లాంటి వారైతే ట్రోలర్స్ చేతిలో అడ్డంగా బుక్ అయి మరీ ఫేమస్ అవుతారు. ఇంతకీ చంద్రహాస్ ఎవరన్నదే కదా ప్రశ్న.. బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కొడుకు. ఇటీవలే సినిమా ఎంట్రీ గురించి ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రభాకర్ కొడుకును మీడియకు పరిచేయం చేసాడు. అంతా బాగుంది కానీ చంద్రహాస్ ఆటిట్యూడ్ వల్ల బాగా ట్రోల్ అవుతున్నాడు.

మంచు ఫ్యామిలీ ని దాటేసిన చంద్రహాస్…
సినిమాల్లో హీరోగా వస్తున్నట్లు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం తప్పు కాదు కానీ మరీ ఓవర్ బిల్డ్అప్ ఇవ్వడం తప్పు. ఒకేసారి మూడు సినిమాలతో వస్తున్న చంద్ర హాస్ తన స్పీచ్ బాగా ఇచ్చాడు కానీ బాబుకి ఆటిట్యూడ్ బాగా ఎక్కువ అనేలా మాట్లాడాడు. డాన్స్ పరంగా నాటు నాటు పాటకు డాన్స్ వేసి ప్రూవ్ చేసుకున్న చంద్రహాస్ ఇక నటన పరంగా ప్రూవ్ చేసుకోవాలి. అయితే బాబు స్పీచ్ లో మాత్రం తన గురించి సినిమా పిచ్చి గురించి చెప్పడం కొంచెం ఎక్కువ అయింది. అదే ఇప్పుడు ట్రోల్స్ కి కారణం అయింది. ఇన్ని రోజులు మంచు ఫ్యామిలీ మీద పగ పట్టినట్లు ట్రోలర్స్, మీమర్స్ ట్రోల్ల్స్ చేస్తూ వచ్చారు.

కానీ ఇప్పుడు చంద్ర హాస్ వారి ప్లేసుని కొట్టేసాడు. బాబు ముందు వీడియోలు కూడా ట్రెండ్ అవుతూ ఇంత ఆటిట్యూడ్ ఉంటే ఎలారా నాయనా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల చంద్రహాస్ 22వ బర్త్ డే సందర్భంగా ప్రభాకర్ ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి హీరోగా డెబ్యూ చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఇక చంద్రహాస్ డెబ్యూ సినిమా కొత్త దర్శకుడు కృష్ణ దర్శకత్వంలో కిరణ్ బోయినపల్లి, కిరణ్ జక్కంశెట్టి నిర్మిస్తున్నారు. ఇక రెండో సినిమాను ఏవీఆర్ మూవీ వండర్స్ పతాకంపై ఏవీఆర్, నరేష్ నిర్మాణంలో సంపత్ వి. రుద్ర తెరకెక్కించనున్నాడు. మూడో సినిమాను ప్రభాకర్ సొంత బ్యానర్ లో నిర్మించనున్నట్లు తెలిపారు. ఒకేసారి మూడు సినిమాలతో జోరు మీద ఉన్న చంద్రహాస్ ఎంతవరకూ ఇండస్ట్రీలో సక్సెస్ అవుతాడో చూడాలి.



























