Chandini Chowdary : తెలుగమ్మాయి చాందిని చౌదరి విశాఖపట్నంకు చెందిన అమ్మాయి. కాలేజీ లో ఇంజనీరింగ్ చదవే రోజుల్లో షార్ట్ ఫిలిమ్స్ లో నటించేది. ప్రేమ ప్రేమ, లవ్ అట్ ఫస్ట్ సైట్, తదితర వెబ్ సిరీస్ లలో నటించింది. ఇక హీరో రాజ్ తరుణ్ తో కలిసి చేసిన బ్లైండ్ డేట్ అనే వెబ్ సిరీస్ వల్ల మంచి గుర్తింపు వచ్చింది. మొదట్లో శేఖర్ ఖమ్ముల లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, ప్రేమ ఇష్క్ కాదల్ వంటి చిత్రాల్లో చిన్న పాత్రలలో నటించింది. ఇక కుందనపు బొమ్మ, శమంతకమణి, హౌరా బ్రిడ్జి, కలర్ ఫోటో, బొంబాట్ వంటి చిత్రాల్లో నటించింది. తాను నటించిన మస్తీ వెబ్ సిరీస్ తో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా కిరణ్ అబ్బవరంతో కలిసి సమ్మతం సినిమాలో నటించింది. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.

నన్ను, నా కుటుంబాన్ని బెదిరించాడు, సపోర్ట్ లేదు కాబట్టి మసి చేస్తారు…..
సమ్మతం సినిమా ప్రొమోషన్స్ కోసం ఈటీవీ లో ప్రసారమయ్యే ఆలీ తో సరదాగా షో కి వచ్చారు హీరో హీరోయిన్ కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి. ప్రోమో లో ఇక సినిమా గురించి మాట్లాడుతూ కిరణ్ ను ఆలీ నువ్వు హీరో అవుతావని చిన్నప్పుడే అనుకున్నావా అనగా మా లెక్చరర్ బస్సు స్టాండ్ లో బఠాణిలు అమ్ముకుంటు బతుకుతావ్ అనే వాడని చెప్పుకొచ్చాడు. ఇక ఓ అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేస్తే చాలా రోజులు కాలేజీ రాలేదని అప్పుడు చాలా లావుగా ఉండటం వల్ల నేను ప్రపోజ్ చేసానని అలా చేయడం వల్ల సన్న బడ్డానని చెప్పాడు.

ఇక చాందిని కి ఇండస్ట్రీలో ఒక పెద్ద ప్రొడ్యూసర్ తో గొడవ జరిగిందని విన్నాను అని ఆలీ ప్రశ్నించగా, నీకు ఇక అవకాశాలు రాకుండా చేస్తానని చెప్పారు. నన్ను నా కుటుంబాన్ని బెదిరించారు అంటూ చెప్పి షాకిచ్చింది. ఇక వెంటనే ఆలీ గారు మరి ఇండస్ట్రీ పెద్దలను కలిసి విషయంలో చెప్పొచ్చుగా అంటే బ్యాక్ అప్ లేని నన్ను వాళ్ళు చిటికెలో ఇలా మసి చేసేస్తారు. కాబట్టి నోరు మూసుకుని ఉండాలి అన్నట్టుగా చూపించారు. అక్కడితో ప్రోమో ఎండ్ చేసారు. అయితే ఇపుడు చాందిని అన్న మాటలు ఎవరిని ఉద్దేశించి, అంటూ పెద్ద చర్చే జరుగుతోంది. కానీ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ఈ చీకటి కోణాలు ఎవరో ఒకరు ఇలా ధైర్యం చేసి చెబితే కానీ బయటకు రావు. అయితే మళ్ళీ కొన్నాళ్ళకి షరా మాములే అన్నట్టుగా మారుతాయి.































