Chandra Babu: ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఈయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలను కూడా ఆహ్వానించారు. కేవలం మెగా కుటుంబం మాత్రమే ఈ వేడుకలలో పాల్గొన్నారు. అయితే అల్లు అర్జున్ తో పాటు ఎన్టీఆర్ ని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు తెలిసింది.

ఈ విధంగా అల్లు అర్జున్ ఎన్టీఆర్ ఇద్దరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన ఈ హీరోలు ఇద్దరు ఈ వేడుకకు దూరంగా ఉన్నారు. ఇక రామ్ చరణ్ కి మాత్రం ఈ కార్యక్రమానికి హాజరైన సంగతి మనకు తెలిసిందే. ఇలా అల్లు అర్జున్ ఎన్టీఆర్ ని ఆహ్వానించిన వీరిద్దరూ రాకపోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి.
ఇప్పటికే మెగా కుటుంబంతో అల్లు అర్జున్ కి మధ్య విభేదాలు తలెత్తాయి. కేవలం తన స్నేహితుడికి మద్దతు తెలపడంతో మెగా ఫ్యామిలీ తనని దూరం పెట్టారని తెలుస్తుంది. ఇలా అల్లు అర్జున్ ని దూరం పెట్టినప్పటికీ చంద్రబాబు నాయుడు ఈయనని ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన అల్లు అర్జున్ మాత్రం దూరంగా ఉన్నారు. అందుకు కారణం పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో ఈయన బిజీగా ఉండటమే అని చెప్పాలి.
షూటింగ్ పనులలో బిజీ బిజీ..
ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ సైతం దేవర సినిమా కోసం గోవా వెళ్లారు దీంతో ఈయన కూడా అక్కడ షూటింగ్లో బిజీగా ఉన్న నేపథ్యంలోనే రాలేకపోయారని తెలుస్తుంది. ఇటీవల రామోజీరావు మరణించినప్పుడు కూడా వీరు హాజరు కాకపోవటం గమనార్హం.





























