Chandra Mahesh : తెలుగులో ఎంతోమంది కెరీర్ వెతుక్కుంటూ తమ ప్రతిభను నిరూపించుకోవాలని సినిమా ఇండస్ట్రీలోకి వస్తారు. అలా వచ్చిన వ్యక్తే చంద్ర మహేష్. తూర్పు గోదావరి జిల్లా కు చెందిన చంద్ర మహేష్, సురేష్ ప్రొడక్షన్ హౌస్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసారు. ‘ధర్మచక్రం’ వంటి సినిమాకు పనిచేసిన చంద్ర మహేష్ ఆ తరువాత 1999 లో శ్రీకాంత్ తో తీరిన ‘ప్రేయసి రావే’ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. అప్పట్లో ఈ సినిమా సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తరువాత చంద్ర మహేష్ కి మంచి అవకాశాలు వచ్చాయి. పెద్ద హీరోలైన చిరంజీవి వంటి వారు సినిమా కథ రెడీ చేసుకో సినిమా చేద్దామని అడిగారట.

శ్రీహరిని చులకన గా చూసే వారు…
మంచి ఫామ్ లో ఉండటంతో మాతృ సంస్థ అయిన సురేష్ ప్రొడక్షన్స్ నుండి సినిమా ఆఫర్ వచ్చిందట మహేష్ గారికి. కొన్ని హాలీవుడ్ సినిమాలను ఉదాహరించి, ప్రేయసిరావే లాగా సెంటిమెంట్ జోదించి సినిమా కథను రాసుకోమని చెప్పారట. అయితే ఏ కథ చెప్పినా సరిగా నచ్చకపోవడంతో, ఇక ఆరు నెలలు అప్పటికే గడిచిపోయాయి. అయినా కథ కుదరలేదు. ఆలోటికి వెంకటేష్ గారి ‘జయం మనదేరా’ సినిమా వచ్చేసింది. సురేష్ బాబు పిలిచి ఏం పర్వాలేదు నిదానంగా చేసుకో జయం మనదేరా సినిమాకు తంబ్స్ అప్ వారు యనభై లక్షలు ఇస్తున్నానరు బ్రాండ్ ని ప్రమోట్ చేయడానికి కాబట్టి ఆ డబ్బు తో తీసేయొచ్చు అందుకే నువ్వు ఇంకొంత కాలం ఆగు అని చెప్పారట. ఇక సినిమా పోయినట్లే అని అర్థమైంది. దాంతో నన్ను అంతకు ముందు సినిమా చేద్దాం అన్న పెద్ద హీరోల వద్దకు పోయినా అందరూ బిజీగా ఉన్నాము అని, ఒక ఆరు నెలలు అసగాలని చెప్పడం తో ఏం చేయాలో అర్ధజం కాలేదు, ఇక అదే సమహాలో శ్రీహరి ఇంటికి వచ్చి ఐదు లక్షలు అడ్వాన్స్ ఇచ్చి సినిమా కథ లైన్ చెప్పి సినిమా చేద్దామని అడుగగా, నువ్వైతేనే చేయగలవని అడగడంతో చాలా గొప్పగా అనిపించింది.

ఇక శ్రీహరి తో ‘అయోధ్య రామయ్య’ సినిమా చేశాను. ఇక మళ్ళీ శ్రీహరి తోనే ఒక్కడే, ఆ తరువాత హనుమంతు సినిమా కూడా చేశాను. అయితే ఆ సమయంలో వేరే అవకాశాలు రాకపోడానికి కారణం శ్రీహరి గారి మీద ఉన్న ఒకింత చులకన భావం కారణం. ఆయన సినిమాలు అంటే నాలుగు ఫైట్లు, కొన్ని డైలాగులు ఉంటాయనే భావన ఉండేది అందుకే ఆయనతో సినిమా చేసిన నా మీద కూడా శ్రీహరితో మాత్రమే సినిమాలు చేస్తాడు అన్నట్లు ముద్ర పడిపోయింది. అయితే ‘బన్నీ’ సినిమా సమయంలో చిరంజీవి గారితో సినిమా అవకాశం వచ్చినా మళ్ళీ కథ కుదరక సినిమా అవకాశం పోయింది అని చెప్పారు చంద్ర మహేష్.






























