దాదాపు 163 సీట్లా? కలలో కూడా ఊహించని విజయమిది.. క్లిస్టర్ క్లియర్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ.. ఐదేళ్ల అరాచకానికి చెంపపెట్టు… నోటి దురుసుకు తగిలిన దెబ్బ.. సంక్షేమానికి అందని ఫలాలు.. అభివృద్ధికే ఓటేసిన ఏపీ ప్రజానీకం.. పథకాలు కాదు.. ప్రాజెక్టులు కావాలన్న తపన.. రోడ్లు కూడా వేయలేని ప్రభుత్వానికి వెన్నుపూస విరిచేసిన ఏపీ ప్రజానీకం… కొండంత ఆశ చూపి.. గోరంత కూడా చేయలేని చేతకాని తనానికి పెట్టిన చెక్.. ఉద్యోగాలు.. ఉద్యోగుల వెతలు పట్టని ప్రభుత్వాన్ని రెక్కలు విరిచేసిన ఏపీ ప్రజానీకం. ఇది ఒక్క వైసీపీ ప్రభుత్వానికే కాదు.. దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వానికైన అతి పెద్ద గుణపాఠమే.

చంద్రబాబు ఇంతటి మైండ్ వర్క్ చేశారా?
టీడీపీ అధినేత చంద్రబాబు.. ఈసారి పట్టువదలని విక్రమార్కుడే అయ్యారు. తనను జైలు పాలు చేసిన వైసీపీ అధినేతకు కొట్టకుండా తిట్టకుండా దెబ్బేశారు. 93 శాతం స్ట్రైక్ రేట్‌తో సైకిల్‌ను దూసుకెళ్లేలా చేశారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా వైసీపీకి లేకుండా చేశారు. ఒక మౌనమునిలా చంద్రబాబు ఇదంతా చేశారు. 23 ఏళ్ల తర్వాత కొడాలి నానిని ఇంటికే పరిమితం చేసిన ఘనత చంద్రబాబుదే. అసలు ఇంతటి ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఎవరికీ అంతుబట్టడం లేదు. నిన్న మొన్నటి వరకూ ఎగిరెగిరి పడిన వైసీపీ నేతలు కనీసం బయటకు కూడా కనిపించడం లేదు. అసలు ఇదంతా ఎలా సాధ్యమైంది? చంద్రబాబు ఇంతటి మైండ్ వర్క్ చేశారా? ముఖ్యంగా ఏపీని అర్థం చేసుకోవడంలో ఆయన అంతలా ఎలా సక్సెస్ అయ్యారు? 1994లో టీడీపీ భారీ విజయం సాధించింది. ఇప్పుడు అంతకు మించిన విజయం దిశగా పార్టీని ఆయన ఎలా నడిపించగలిగారు? ఇదంతా ఎలా సాధ్యం?

క్యాస్ట్ అండ్ కాంబినేషన్స్..
వైసీపీ అపజయాలన్నింటినీ జనాల్లోకి తీసుకెళ్లడంలో ముందుగా కూటమి సక్సెస్ అయ్యింది. ఆ తరువాత చంద్రబాబు అర్థం చేసుకున్న విషయం.. క్యాస్ట్ అండ్ కాంబినేషన్స్.. ఏపీ కులానికి పెద్ద పీట వేస్తుందనడంలో సందేహం లేదు. ఇక్కడ కమ్మ, రెడ్డి, కాపు సామాజిక వర్గాలదే హవా. కమ్మ కులాన్ని దాదాపుగా తన పక్కనే పెట్టుకున్నారు. జనసేన ద్వారా కాపులందరినీ ఏకం చేశారు. వైసీపీపై వ్యతిరేకతతో ఉన్న రెడ్లందరినీ టీడీపీలోకి లాగేశారు. ఇక దళితులపై జరిగిన అరాచకాలను జనంలోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. బీసీలకు దక్కని గౌరవాన్ని వారికి తెలిసేలా చేశారు. ఇక్కడ కులమే కాదు.. అభివృద్ధి లేమి కూడా నూటికి నూరు శాతం పని చేసింది. దీంతో పాటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్వయంకృతం కూడా ఎన్డీఏ కూటమికి కలిసొచ్చింది. మొత్తమ్మీద రాజధాని లేకుండా వైసీపీ చేస్తే.. ప్రతిపక్షమే లేని రాష్ట్రంగా చంద్రబాబు ఏపీని మార్చేశారు.





























