Charmi : పూరీజగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే హీరో హీరోయిన్లుగా లైగర్ సిమిమా ఆగస్టు 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిదిందే. ఈ సినిమాను పూరి జగన్నాథ్ చార్మీ, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించారు. సినిమా విడుదలకు ముందు నుండే అందరు లైగర్ గురించి చర్చించుకున్నారు. అంతలా ఈ సినిమా ప్రమోషన్లు జరిగాయి. ఇక సినిమా విడుదల తరువాత కూడా అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు ఈ సినిమా గురించి ఇంతలా ప్రమోషన్ చేశారు అని. సినిమాపై, పూరి జగన్నాథ్ పై నమ్మకంతో చార్మీ చాలా నష్టపోయిందని అనుకుంటున్నారు.

ఇలా… జరుగుతుందని అస్సలు అనుకోలేదు…
సినిమా విడుదల ముందు ప్రమోషన్లు చాలా బాగా జరిగాయి. ఇక విజయ్ దేవరకొండ, చార్మీ మాటలు సినిమా పై హైప్ పెంచాయి. కానీ సినిమా చూసాక వారు చేసిన కామెంట్లను నెటిజన్లు టార్గెట్ చేసి బాగా ట్రోల్ చేస్తున్నారు. ఇక సినిమా విడుదల అయ్యాక మొదటి ఆటకే భారీ ప్లాప్ టాక్ ను మూటగట్టుకుంది. సినిమాపై చాలా నమ్మకం పెట్టుకుని అది కాస్త ప్లాప్ అవ్వడంతో చార్మీ బాగా ఎమోషనల్ అయ్యారట.

సినిమా కోసం దాని మీద నమ్మకంతో అనుకున్న దానికన్నా ఎక్కువగానే ఖర్చు చేసిందట. తాను ఇన్నాళ్లుగా కష్టపడి సంపాదించింది అంతా ఈ సినిమా మీద పెట్టినట్లు చార్మీ ఇదివరకే చెప్పింది. అయితే సినిమా ప్లాప్ అవ్వడంతో చాలా బాధపడిందట. ఈ క్రమంలోనే తనకు దగ్గరి వారి దగ్గర ఎమోషనల్ అయ్యారట. తన కెరీర్ గ్రాఫ్ దారుణంగా పడిపోయిందని చెప్పుకున్నారని సమాచారం.



























