Charmi : 2002 లో ‘నీతోడు కావాలి’ సినిమా ద్వారా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యింది. మొదటి సినిమా హిట్ అవ్వకపోయినా, తమిళ్, మలయాళం లో సినిమాలు చేసింది. తరువాత ‘నీకే మనసిచ్చాను’ సినిమా ద్వారా మళ్ళీ తెలుగులోకి వచ్చింది. శ్రీ ఆంజనేయం, మాస్, చక్రం, అనుకోకుండా ఒక రోజు, పౌర్ణమి, రాఖీ, మంత్ర వంటి సినిమాలలో నటించింది. అయితే జ్యోతి లక్ష్మి సినిమా లో ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా ఆ సినిమాను తానే స్వయంగా నిర్మించడం విశేషం. తరువాత కూడా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పైసా వసూల్, ఇస్మార్ట్ శంకర్, వంటి సినిమాలను నిర్మించింది. నటనకు స్వస్తి పలికి ప్రస్తుతం నిర్మాతగా మాత్రమే వ్యవహారిస్తోంది. తాజాగా పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వస్తున్న లైగర్ సినిమాను పూరి తో కలసి నిర్మిస్తోంది.

చేతిలో రూపాయి లేదు అంటూ… లైవ్ లో ఏడ్చేసిన చార్మీ…
విజయ్ దేవరకొండ- పూరీ కాంబినేషన్ లో రాబోతున్న లైగర్ సినిమా గురించి ప్రస్తుతం ఇండియా మొత్తం చర్చ జరుగుతోంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్లు కూడా చిత్ర బృందం మొదలుపెట్టింది. నార్త్ లో ప్రమోషన్ ముగించుకొని, ఇపుడు తెలుగులో మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే చార్మీతో ఒక ఇంటర్వ్యూ కూడా టీం ప్లాన్ చేశారు. ఫాన్స్ అడగాలి అనుకునే ప్రశ్నలను ఈ షో ద్వారా చార్మీ అడిగింది. అంతేకాకుండా ప్రేక్షకులను థియేటర్ కు రప్పించే ప్రయత్నం చేశారు.

అయితే చార్మీ వరుస ప్రశ్నలు పూరీని విజయ్ ని అడగడం జరిగింది. ఇక ఒక విషయం గురించి మాట్లాడుతూ.. సినిమా బడ్జెట్ అనుకున్న దానికన్నా బాగా పెరిగిపోయింది. చేతిలో డబ్బులు లేని సమయంలో ఓటీటీ నుండి మంచి ఆఫర్ వచ్చినా సినిమా అమ్మకుండా వుండాలంటే దమ్ము కావలి అని చెబుతూ ఏడ్చేసింది. తరువాత ఒక వేళ జనాలు థియేటర్ కి రాకపోతే సినిమా ప్లాప్ అయితే, అని పూరి ని విజయ్ ని అడిగింది చార్మీ. అయితే దీనికి సమాధానం ప్రమోలో సస్పెన్స్ లో ఉంచారు. దీనికి సంబందించిన పూర్తి ఎపిసోడ్ ఆగష్టు 19 న విడుదల చేయనున్నారు.

































