ఛత్రపతి చంద్రశేఖర్ భార్య మన అందరికీ తెలిసిన టాలీవుడ్ నటి అని మీకు తెలుసా?

0
9303

సాధారణంగా సినిమా రంగంలో ఛాన్స్ లు వెతుక్కోవడం ద్వారా చాలా మంది నటీనటులకు, టెక్నీషియన్స్ కి కొందరు పరిచయం అవుతుంటారు. ఏ ఒక్కరు సక్సెస్ అయినా కూడా మరొకరు ఆ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేలా చేయడం సినిమా రంగంలో సర్వ సాధారణం. అయితే అదే తరహాలో దర్శకదీరుడు రాజమౌళి తన మొదటి కెరీర్ నుంచి పరిచయం ఉన్న చంద్ర శేఖర్ అనే నటుడుకి జక్కన్న లైఫ్ ఇచ్చాడు. చాలా వరకు ప్రతి సినిమాలో రాజమౌళి చంద్ర శేఖర్ లోని టాలెంట్ నిచాలా బాగా వాడేవారు. ముఖ్యంగా “ఛత్రపతి” సినిమాలో ప్రభాస్ స్నేహితుడిగా చంద్ర శేఖర్ఎ మోషనల్ సీన్స్ లో అద్భుతంగా నటించి క్రేజ్ అందుకున్నాడు.

రాజమౌళి సినిమాల్లో చంద్ర శేఖర్ తప్పకుండా ఉంటాడు అనే విధంగా టాలీవుడ్ లో ఒక టాక్ ఉండిపోయింది. అయితే ఆమధ్య ‘బాహుబలి” లాంటి ప్రతిష్టాత్మక చిత్రాల్లో అతను కనిపించకపోవడంతో కొందరు షాక్ అయ్యారు. అయితే మొదట్లో చంద్ర శేఖర్ కి క్యారెక్టర్ ఇచ్చారట. 20 రోజుల వరకు షూటింగ్ ఉంటుందని కూడా డేట్స్ ఫిక్స్ చేసుకున్నారు. కానీ షూటింగ్ టైం దగ్గర పడుతున్నప్పుడు చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి కాల్ రాకపోవడంతో చంద్ర శేఖర్ రాజమౌళి ఆఫీస్ కి వెళ్లాడట. విషయం ఏమిటని అడగ్గా.. రాజమౌళి చంద్ర శేఖర్ కి సమాధానం ఇస్తూ.. ఎందుకో ఆ ఎపిసోడ్ కథకు అడ్డం పడినట్లు అనిపిస్తోంది. ఏదో విధంగా నిన్ను పెట్టి తీయవచ్చు కానీ అంతగా బావుండకపోవచ్చు. అలా నిన్ను చూపెట్టడం నాకు ఇష్టం లేదని చెబుతూ.. మేనేజర్ కి నిన్ను తీసేసినట్లు ముందే చెప్పాలని నేను చెప్పాను. కానీ వాళ్లు నీకు చెప్పకపోడం వలనే మిస్టేక్ అయ్యిందని రాజమౌళి చెప్పాడట. దాంతో చంద్ర శేఖర్ కూడా ఏ మాత్రం నిరాశ చెందకుండా వెనక్కి వచ్చేసినట్లు ఈమధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు.

టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టులలో మంచి డిమాండ్ ఉన్న నటుడుగా చంద్రశేఖర్ ఇప్పటికి కొనసాగుతూనే ఉన్నాడు, ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం “ఆర్ ఆర్ ఆర్” లో కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు, అయితే కేవలం వెండితెరపై మాత్రమే పరిచయం ఉన్న చంద్రశేఖర్ వ్యక్తిగత జీవితం గురించి చాల తక్కువ మందికి మాత్రమే తెలుసు. చంద్ర శేఖర్ సినీ కెరీర్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన “స్టూడెంట్ నెంబర్ 1” సినిమా ద్వారా మొదలయ్యింది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. దర్శకుడిగా రాజమౌళి కి అదే తొలి సినిమా, అలాగే చంద్ర శేఖర్ కి కూడా అదే తొలి సినిమా, ఈ సినిమా తర్వాత చంద్ర శేఖర్ రాజమౌళి తీసిన ప్రతి ఒక్క సినిమాలో విభిన్నమైన పాత్రలు పోషించి మంచి క్యారెక్టర్ ఆర్టిస్టు గా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన సంగతి తెలిసిందే.

ఇవన్నీ పక్కన పెడితే చంద్ర శేఖర్ భార్య మన తెలుగు సినిమా రంగంలో పెద్ద నటి అని తెలుసా.? చంద్ర శేఖర్ భార్య పేరు నిలీయ భవాని. ఈమె టాలీవుడ్ లో కిక్ 2 , సైరా నరసింహ రెడ్డి, నాని జెంటిల్ మ్యాన్, రామ్ పండగ చేసుకో.. వంటి ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది, ఒక్క టాలీవుడ్ లో మాత్రమే కాదు కోలీవుడ్ లో కూడా అజిత్ మరియు విజయ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించింది, ప్రస్తుతం ఆమె బుల్లితెర సీరియల్స్ లో మంచి డిమాండ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ మాత్రమే కాకుండా మోడలింగ్ లో మంచి నైపుణ్యం సంపాదించింది. ఖమ్మం జిల్లాలో పుట్టి పెరిగిన నీలియా భవాని చంద్ర శేఖర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీళ్లిద్దరు ప్రేమలో ఉన్న సమయానికి చంద్ర శేఖర్ సినిమాల్లోకి అడుగు పెట్టలేదు, అంతేకాకుండా చంద్ర శేఖర్ కి ఆ సమయానికి ఎలాంటి ఉద్యోగం కూడా లేకపోవడంతో నీలియా భవాని తల్లి తండ్రుల వీళ్లిద్దరి పెళ్ళికి ఒప్పుకోలేదు. దాంతో నీలియా భవాని చంద్ర శేఖర్ తో కలిసి హైదరాబాద్ కి వచ్చి పెళ్లి చేసుకుంది, ఆ తర్వాత చంద్ర శేఖర్ సినిమాల్లో ఛాన్స్ లు కోసం ప్రయత్నిస్తుండగా అప్పుడే రాజమౌళి ఈటీవీ లో తెరకెక్కిస్తున్న “శాంతి నివాసం” సీరియల్ లో చిన్న పాత్రలో నటించే ఛాన్స్ వచ్చింది.

ఆవిధంగా చంద్ర శేఖర్ సినిమాల్లో బిజీ కావడంతో నీలియా భవాని కూడా అయన అడుగుజాడల్లో నడిచి సినీ రంగంలోకి ప్రవేశించి మంచి మంచి పాత్రలు పోషిస్తూ అతి తక్కువ కాలం లోనే స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎదిగింది. కాకపోతే దురదృష్టకరమైన విషయమేమిటంటే.. మంచిగా కొనసాగుతున్న వీరిద్దరి దాంపత్య జీవితం కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల విడాకుల వరకూ దారి తీసింది. ఈ దంపతుళ్లిద్దరికీ ఒక్క కొడుకు, ఒక్క పాప ఉన్నారు, ప్రస్తుతం వీళ్లిద్దరు నీలియా భవానితోనే ఉంటున్నారు, కూతురు పూజిత అపోలో మెడికల్ కాలేజీలో మెడిసిన్ చేస్తుండగా, కొడుకు మహేశ్వరన్ క్రికెటర్ గా స్థిరపడాలి అని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. వీలైనంత త్వరగా వీళ్ళిద్దరూ మళ్ళీ కలవాలని కోరుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here