అప్పు తీసుకుని, తిరిగి ఇవ్వనందుకు కర్ణాటక రాష్ర్టంలోని దొడ్డబళ్లాపురంకు చెందిన మాజీ ఎమ్మెల్యే జే నరసింహస్వామి, ఆయన భార్యపై చీటింగ్ కేసు నమోదైంది. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు కోసం నరసింహస్వామి తన వద్ద రూ.3 కోట్లు అప్పు తీసుకున్నారని తరువాత వాటిని తిరిగి ఇవ్వలేదంటూ సంగమ్‌దేవ్ బెంగళూరు సంజయ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

3 కొట్లకు గాను తనకు రూ.85 లక్షలు మాత్రం ఇచ్చారని, మిగతా బాకీ ఇవ్వలేదని ఫిర్యాదు పెర్కొన్నాడు. డబ్బు ఇవ్వమని అడిగితే ఇవ్వకపోగా బెదిరిస్తున్నారని తెలిపాడు.



































