యూట్యూబ్ లో చూసి బీర్ తయారు చేసి అమ్మకానికి పెట్టాడు…! అరెస్ట్ చేసిన పోలీసులు..

0
217

యూట్యూబ్ లో చూసి క్యారెట్ బీర్ తయారు చేసాడు. అక్కడితో ఆగకుండా దాన్ని అమ్మకానికి పెట్టాడు.. దీంతో పోలీసులు అతనిని అరెస్ట్ చేసారు. తమిళనాడులోని తిరుచ్చినాం, కుప్పం ప్రాంతంలో క్యారెట్ బీర్ తయారు చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు వచ్చిన సమాచారంతో ఆ ప్రాంతంలో పోలీసులు గాలించగా, అదే ప్రాంతానికి చెందిన సుకుమార్ అనే వ్యక్తి క్యారెట్ బీర్ ను తయారు చేస్తూ విక్రయిస్తున్నట్టు తెలిసింది. వెంటనే అతడిని పోలీసులు అరెస్ట్ చేసి, అమ్మడం కోసం సిద్ధంగా ఉంచిన రెండు లీటర్ల క్యారెట్ బీర్ ను స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని రసాయనాలకు కలిపి రెండు రోజుల పులియపెట్టిన తరువాత దాన్ని తాగితే మత్తు ఏర్పడుతుందని యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నానని, పోలీసుల విచారణలో తెలిపాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here