Chethan cheenu : మంత్ర 2, రాజు గారి గది వంటి హార్రర్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు చేతన్. తెలుగులో కంటే ముందే తమిళంలో పలు సినిమాల్లో నటించినా హీరోగా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూ నచ్చిన పాత్రలను చేస్తూ వచ్చాడు. చేతన్ సత్యం డైరెక్టర్ సూర్యకిరణ్, కళ్యాణిలకు బంధువు, సూర్యకిరణ్ వాళ్ళ ఇంట్లోనే పెరిగాడు. ఇక సినిమాల విషయంలో వారి హెల్ప్ ఎపుడు తీసుకోలేదని చెప్తూ ఎలాంటి పాత్రలు ఎంపిక చేసుకోవాలో మాత్రం సలహాలు తీసుకునేవాడిని అంటూ తన నేపథ్యం, సినిమాల్లో జరిగిన సంఘటనలు చెప్పారు.

రాత్రికి రాత్రే ఆ సినిమాలో నుండి నన్ను తీసేసారు…
తమిళంలో అంజలి గారితో కలిసి ఒక సినిమా చేసాక అది తెలులో ‘సతీ లీలావతి’ గా విడుదల అయింది. ఇక హీరో విశాల్ సినిమాలో కీలకపాత్రలో నటించాను అది తెలుగులో ‘ఇంద్రుడు’ గా విడుదల అయి మంచి ప్పేరు వచ్చింది. అదే సమయంలో నేను తెలుగులో ఒక మంచి లవ్ స్టోరీ లో హీరోగా నటించాలనే ఉద్దేశంతో క్రియేటివ్ హెడ్ ప్రొడక్షన్ బ్యానర్ చుట్టూ తిరిగేవాడిని. కే ఎస్ రామారావు గారి అబ్బాయి వల్లభ నాకు మంచి మిత్రుడు అవ్వడం వల్ల అతని ద్వార సినిమా స్క్రిప్ట్ వినే వాడిని. ఆ టైములోనే మంత్ర 2 ఆఫర్ వచ్చింది. గార్నియర్ షాంపూ యాడ్ లో నన్ను చూసి ఆ సినిమా కోసం నన్ను అడిగారు. ఆ సినిమా తో పాటే రాజు గారి గది సినిమా అవకాశం వచ్చింది. మొదట చేయాలంటే ఆలోచించాను కానీ వల్లభ వచ్చిన అవకాశన్ని వదులుకోకు చెయ్యి అని చెప్పాడు. ఇక అలా ఆ రెండు వినిమాలు చేసాను. అయితే రాజు గారి గది సినిమా మంచి సక్సెస్ అయింది, ఇప్పటికీ నన్ను ఆ సినిమాతో గుర్తిస్తారు.

ఆ సినిమా తరువాత పెద్ద సినిమా ఆఫర్ వచ్చింది, స్క్రిప్ట్ ఓకే అయి మేకప్ మ్యాన్ తో సహా అన్నీ కుదిరాక నన్ను తీసేసి వేరే అతన్ని హీరోగా పెట్టారు. ఇక శీను వైట్ల గారు వరుణ్ తేజ్ సినిమా ‘మిస్టర్’ సినిమా కోసమో లేకపోతే ‘బ్రూస్లీ’ సినిమా కోసమో తెలియదు కానీ అడిగారు. అయితే నేను ఆలోచించాను ఒకసారి హీరో కాకుండా వేరే పాత్రలు చేస్తే ఇక అవే వస్తాయని అందుకే వద్దనుకున్నా, అదే విషయం ఆయనకు చెప్పాను అంటూ చెప్పాడు. సినిమా ఇండస్ట్రీ లో ఒక ప్రాజెక్ట్ మన దాకా వచ్చినా మధ్యలోనే వెళ్లిపోవచ్చు, లేకపోతే మనమే సినిమాలో చేసినా సినిమా విడుదల కాకపోవచ్చు, ఒకవేళ సినిమా విడుదల అయినా అందులో మన పాత్ర నిడివి ఉంటుందో లేదో తెలియదు. అంతా జరిగాక మనకు గుర్తింపు వస్తుందో లేదో తెలియదు ఇక్కడ లక్ కూడా ఉండాలి అంటూ తన సినిమా నేపథ్యం చెప్పాడు.



























