Child artist Aani : హీరోయిన్ గా మారిన మరో చైల్డ్ ఆర్టిస్ట్…!

0
40

Child artist Aani : హీరో నాగార్జున సినిమా సాంఘిక చిత్రం ‘రాజన్న’లో ఆయన కూతురు మల్లమ్మ పాత్రలో గుర్తుండిపోయేలా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఆనీ. తెలుగులో అనుకోకుండా ఒకరోజు సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి చిరంజీవి, బాలకృష్ణ, మహేష్ బాబు, రవితేజ ఇలా అందరు స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఆని చివరగా ‘రంగస్థలం’లో రామ్ చరణ్ కి చెల్లిగా నటించింది. ఇక ఆ సినిమా తరువాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ అమ్మడు తాజాగా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది.

తికమక తాండ’ లో హీరోయిన్ గా ఆని…

1990 ప్రాంతంలో ఒక గ్రామీణ ప్రాంతంలో సాగే కథగా తికమక తాండ సినిమా సాగనుంది. ఈ సినిమాలో హీరోలుగా హరికృష్ణ, రామకృష్ణ అనే ఇద్దరు కవలలు నటిస్తుండగా గ్రామంలోని అందరికీ మతిమరుపు ఉండటం అనే కాన్సెప్ట్ తో సినిమాను టీఎస్ఆర్ గ్రూప్ అధినేత తిరుపతి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు.

గౌతమ్‌ మీనన్‌, చేరన్‌, విక్రమ్‌ కె.కుమార్‌ వంటి దర్శకుల దగ్గర కో-డైరెక్టర్‌గా పని చేసిన వెంకట్‌ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇక సినిమాలో ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలకు తావు లేకుండా కుటుంబ కథగా సినిమాను తీస్తున్నట్లు తెలుస్తోంది. చైల్డ్ ఆర్టిస్ట్ గానే ఎన్నో నంది అవార్డులు సొంతం చేసుకున్న ఆని ఈ సినిమాతో హీరోయిన్ గా ఎలా పెరఫార్మెన్స్ ఇస్తుందో చూడాలి.