శంకర్ దాదా ఎంబీబీఎస్ లో ఈ కుర్రోడు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..!! ఇప్పుడు మెగా హీరో..!

0
538

మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో నటించిన ఈ కుర్రాడు తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండే ఉంటాడు.. “శ్రీ రామచంద్రమూర్తి” అనే అందమైన పేరుతో చేసిన ఆ పాత్ర శంకర్ దాదా సినిమా చూసినవారు మర్చిపోలేరు. ఎందుకంటే ఆ సినిమాలో ఆ కుర్రాడు చేసిన క్యారెక్టర్ ఏకంగా సినిమాను మలుపుతిప్పే అద్భుతమైన పాత్ర. అత్యంత కీలకమైన క్యారెక్టర్. సినిమా మొత్తం మీద ఒక్క డైలాగ్ కూడా చెప్పడు కానీ ఆ పాత్రతో తెలుగు ప్రేక్షకుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. ముద్దు ముద్దుగా ఉండే ఆకుర్రాడు అందరిని ఆకట్టుకున్నాడు. అప్పట్లో ఈ కుర్రాడు ఎవరో చైల్డ్ ఆర్టిస్ట్ అనుకున్నారు. కానీ అసలు విషయం ఏమిటంటే ఈ కుర్రాడు మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన వాడే..

ప్రస్తుతం ఈ కుర్రోడు కూడా హీరో అయిపోయాడు. ఎవరో తెలుసా? అదేనండీ మెగా మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్. ఉప్పెన అనే సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఈ చిత్ర విడుదల ఆగిపోయింది. అప్పట్లో శంకర్ దాదా ఎంబీబీఎస్ లో మామయ్య చిరంజీవితో కలిసి నటించాడు. ఆ క్యారెక్టర్ తోనే తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు వైష్ణవ్ తేజ్. అసలు శంకర్ దాదా ఎంబీబీఎస్ లో నటించింది వైష్ణవ్ అని ఎవరికీ తెలియదు.. ఇప్పుడు తెలిసినవారు అందరు షాక్ అవుతున్నారు.