Child artist Sreshta : వాల్తేరు వీరయ్య సినిమా చిరంజీవి, శృతి హాసన్ జంటగా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ సినిమాల్లో చిరంజీవితో పాటు రవితేజ ఒక పవర్ ఫుల్ పాత్రలో నటించారు. ఇప్పటికే విడుదల అయిన పాటలు బాగా హిట్ అయ్యాయి. ఇక ట్రైలర్ అదిరిపోయింది. ఫాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసమే ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాలో రవితేజ కూతురుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ శ్రేష్ఠ సినిమాకు సంబందించిన ముచ్చట్లను తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకుంది.

స్టైల్ కొడుతున్నావా అని చిరంజీవి అడిగారు…
ఆరు సంవత్సరాల వయసు ఉన్న శ్రేష్ఠ, ఆడిషన్స్ లో వాల్తేరు వీరయ్య సినిమాకు సెలెక్ట్ అయింది. సినిమాలో రవితేజ, కాథరిన్ కు కూతురుగా నటించిన శ్రేష్ఠ ఆ సినిమా విశేషాలను పంచుకుంది. సెట్స్ లో అందరూ చాలా బాగా చూసుకున్నారంటూ తెలిపింది. చిరంజీవి గారితో మాట్లాడేటపుడు జుట్టు ఒక రెండు సార్లు వెనక్కి అనుకునేసరికి నా ముందు స్టైల్ కొడుతున్నావా అని అన్నారు అంటూ క్యూట్ గా చెప్పేసింది శ్రేష్ఠ. ఇక కాథరిన్, శృతి హాసన్ కూడా చాలా బాగా చూసుకున్నారని, వాళ్ళు బాగా ఫ్రెండ్స్ అయ్యారంటూ తెలిపింది శ్రేష్ఠ.

ఇక డైరెక్టర్ బాబీ రోజు ఐస్ క్రీమ్ కొనిచ్చేవాడట. చిరంజీవి గారు తనతో కలిసి డ్రాయింగ్ వేసేవారు అంటూ చెప్పిన శ్రేష్ఠ తనకు చాక్లెట్స్ గిఫ్ట్ గా ఇచ్చారంటూ చెప్పింది. అయితే బాగా సెట్స్ లో ఆడుకున్న శ్రేష్ఠ సినిమా షూటింగ్ అయిపోయాక అందరినీ మిస్ అవుతానని చాలా బాధపడ్డానంటూ చెప్తూ పెద్దయ్యాక డాక్టర్ మరియు యాక్టర్ అవుతానంటూ క్యూట్ గా చెప్పింది.


































