చైనాలో కొత్త వ్యాధి… గజగజా వణుకుతున్న ప్రజలు..?

0
262

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో చాప కింద నీరులా కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. చైనా దేశంలోని వుహాన్ నుంచి కరోనా మహమ్మారి వ్యాప్తి చెందిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోమారు చైనా ప్రపంచ దేశాలను టెన్షన్ పెట్టడానికి సిద్ధమవుతోంది. చైనాలోని గన్షు ప్రావిన్స్‌ రాజధాని లాంగ్‌ఝౌలో కొత్తరకం బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతోంది.

చైనాలోని ల్యాబ్ నుంచి గతేడాది ఈ బ్యాక్టీరియా లీక్ అయిందని సమాచారం. బయోఫార్మాస్యూటికల్ కంపెనీ నుంచి లీక్ అయిన ఈ బ్యాక్టీరియా వల్ల డ్రాగన్ పడుతున్న టెన్షన్ అంతాఇంతా కాదు. చైనాలో ఇప్పటివరకు బ్రూసెల్లోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల 3,245 మంది మాల్టా అనే వ్యాధి బారిన పడినట్టు తెలుస్తోంది. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న చైనాకు బ్యాక్టీరియా రూపంలో భారీ షాక్ తగిలిందనే చెప్పాలి.
 
గతంలో కరోనా వైరస్ ఒక ల్యాబ్ నుంచి విడుదలైందని ఆరోపణలు వ్యక్తం కాగా తాజా చైనా శాస్త్రవేత్తలే కొత్త బ్యాక్టీరియా ల్యాబ్ నుంచి విడుదలైందని చెబుతుండటం గమనార్హం. తలనొప్పి, జ్వరం, అలసట, కండరాల నొప్పి, ఆర్థరైటిస్ ఇతర సమస్యలు ఈ బ్యాక్టీరియా బారిన పడిన వారిలో ప్రధానంగా కనిపిస్తున్నాయని తెలుస్తోంది.
 
అమెరికా సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్ నుంచి ఈ విషయాలు వెల్లడయ్యాయి. శాస్త్రవేత్తలు ఆహార పదార్థాలను తినడం ద్వారా ఈ బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందని… ఇప్పటివరకు ఈ బ్యాక్టీరియా బారిన పడి ఎవరూ చనిపోలేదని చెబుతున్నారు. చైనా ఆరోగ్య కమిషన్ కూడా ఇదే ప్రకటన చేసింది. మధ్యధరా జ్వరం లేదా మాల్టా జ్వరం పేరుతో పిలిచే ఈ వ్యాధి బారిన పడితే కోలుకున్నా దీర్ఘకాలిక సమస్యలు వేధిస్తాయి.