Chinmayi Sripada : సింగర్ చిన్మయి తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషలలో ఎన్నో పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకున్న గాయని. ఇక చిన్మయి అనగానే సమంతకి సినిమాల్లో డబ్బింగ్ గుర్తొస్తుంది. సమంతకి తన ప్రతి సినిమాకి మొదటినుండి చిన్మయి నే డబ్బింగ్ చెబుతూ వస్తోంది. ఇక చిన్మయి సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉంటూ ఫెమినిస్ట్ గా తన తోటి మహిళల కష్టాలపై స్పందిస్తుంటుంది. మీ టూ ఉద్యమం పై కూడా గట్టిగానే పోరాడింది.

అలాంటివారిని వదిలేసి నా అకౌంట్ సస్పెండ్ చేసారు….

తాను చిన్నతనంలో ఎదుర్కొన్న లైంగిక వేధింపులను సోషల్ మీడియా ద్వారా పంచుకుని చాలా మంది నోరువిప్పడానికి భయపడే వార్ని ఆలోచించేలా చేసింది. చాలా మంది మహిళలు చిన్మయి తో సోషల్ మీడియాలో తమ బాధలను పంచుకుంటూ ఉంటారు. వారికి తనదైన రీతిలో సమాధానమిస్తూ ఆ సంఘటనలను బయట ప్రపంచానికి చెబుతూ ఉంటుంది. అయితే చిన్మయి ఇలా ఫెమినిస్ట్ గా ఆడవారికోసం మాట్లాడుతుంటే కొంత మంది ఆకతాయిలు అసభ్యకరమైన పోస్ట్లు పెడుతూ వారి మర్మాంగాలను ఫోటోలు తీసి ఆమెకు షేర్ చేస్తుంటారట.

అలాంటి వారిని వదిలేసి ఇంస్టాగ్రామ్ తన అకౌంట్ ను కమ్యూనిటీ గైడ్ లైన్స్ కి విరుద్ధంగా ఉందని సస్పెండ్ చేసారని అలాంటి వారి ఖాతాలు ఇంకా ఉన్నాయని వారికి కమ్యూనిటీ గైడ్ లైన్స్ వర్తించదా అంటూ.. అయినా తన పోరాటం ఆగద సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేసారు. తనకు తమ భాధలను చెప్పాలనుకునే వాళ్లు నన్ను సంప్రదించవచ్చు అంటూ @ LEOFSKIN లేదా @DEEPSKINDIALOGUES ద్వారా చెప్పొచ్చు అంటూ షేర్ చేసింది.

































