Chinna: సినిమా ఇండస్ట్రీకి రాజకీయ రంగానికి చాలా మంచి అనుబంధం ఉంది. ఎంతోమంది సినిమాలలో కొనసాగే వాళ్ళు రాజకీయాలలో కూడా ఉంటారు అలాగే రాజకీయాలకు సంబంధించిన కొంతమంది ఇండస్ట్రీలో కూడా కొనసాగుతూ ఉన్నారు. ఇలా వారికి ఉన్నటువంటి పరపతి పలుకుబడిన ఉపయోగించి ఇండస్ట్రీలోకి వస్తూ సక్సెస్ అందుకున్న వారు కూడా ఉన్నారు.

ఈ క్రమంలోనే స్వయంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం మేనల్లుడు కూడా ఇండస్ట్రీలోకి వచ్చారు కానీ తన మామయ్య సీఎం అని ఎక్కడ చెప్పకుండా ఒక సాధారణ వ్యక్తిలా తన ఫోటోలు పట్టుకొని స్టూడియోల చుట్టూ తిరుగుతూ అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నారు. మరి సీఎం మేనల్లుడి స్థాయిలో పలుకుబడి ఉన్న ఆ నటుడు ఎవరు అనే విషయానికొస్తే ఆయన మరెవరో కాదు నటుడు చిన్నా అని చెప్పాలి.
వర్మ దర్శకత్వంలో వచ్చిన శివ సినిమా ద్వారా నటుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన చిన్నా అనంతరం పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. అయితే గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈయన పలు బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ సందడి చేస్తున్నారు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఈయన తన మామయ్య సీఎం అనే విషయాన్ని బయటపట్టారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ దివంగత ముఖ్యమంత్రి నేదురమల్లి జనార్దన్ రెడ్డి స్వయాన ఈయనకు మేనమామ అవుతారంట. ఆయన సోదరి కుమారుడే చిన్న అనే విషయాన్ని బయట పెట్టారు. అయితే ఎక్కడ కూడా నేను తన మామయ్య పలుకుబడిని ఉపయోగించుకోలేదు కానీ ఒకసారి మాత్రం తన అల్లుడు ఇండస్ట్రీలోకి వస్తున్నారు కాస్త చూస్కో అంటూ దాసరి నారాయణ రావు గారికి ఫోన్ చేశారు. కానీ ఇండస్ట్రీలో ఇలాంటి రికమండేషన్స్ పనికిరావని చిన్నా తెలిపారు.
నటనలో శిక్షణ పూర్తి చేసి, ఫోటోలు పట్టుకొని స్టూడియోల వెంట తిరుగుతూ అవకాశాలను అందుకున్నానని తెలిపారు. ఇలా నటుడిగా గుర్తింపు పొందిన తర్వాత ఒకరోజు తన మామయ్య క్యాబినెట్ మీటింగ్ రోజున నన్ను పిలిపించి అక్కడున్న మంత్రులకు నన్ను పరిచయం చేసి ఈయన ఎవరో తెలుసా అంటూ వారిని అడిగారు. అక్కడున్న వారందరూ కూడా యాక్టర్ చిన్నా కదా అంటూ చెప్పడంతో కాదు నా మేనల్లుడు అంటూ అందరికీ నన్ను అప్పుడు పరిచయం చేశారని చిన్నా తెలిపారు.



























