Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి క్యాన్సర్ బారిన పడ్డారా అంటూ పలు వెబ్ సైట్లలో ఓ వార్త సంచలనంగా మారిన విషయం మనకు తెలిసిందే. ఇలా చిరంజీవి క్యాన్సర్ బారిన పడి చికిత్స తీసుకున్న తర్వాత కోలుకున్నారంటూ వార్త వైరల్ గా మారింది. అయితేఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వెంటనే చిరంజీవి ట్విట్టర్ వేదికగా ఈ వార్తలను ఖండించారు.

హైదరాబాద్ నానక్‌రామ్‌గూడాలోని స్టార్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసి క్యాన్సర్ విభాగాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చిరంజీవి గతంలో తాను చేయించుకున్న ముందస్తు పరీక్షల వల్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదం నుంచి తప్పించుకున్నానని తెలిపారు. అయితే కొందరు ఈ విషయాన్ని సరిగా అర్థం చేసుకోకుండా ఈయన క్యాన్సర్ బారిన పడ్డారంటూ వార్తలు రాశారు.
చిరంజీవి ఆరోగ్యం గురించి ఈ విధమైనటువంటి వార్తలు వచ్చిన తరుణంలో ఈయన ట్విట్టర్ వేదికగా స్పందించారు.నేను కేవలం క్యాన్సర్ పట్ల అవగాహన ఉండాలని తరచు వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్ల ఇలాంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉండవని చెప్పాను. గతంలో నేను కొలనోస్కోపీ టెస్ట్ చేయించుకున్నాను. అందులో క్యాన్సర్ రహిత పాలిప్స్‌ని గుర్తించి తొలగించారు. ఒకవేళ ముందుగా పరీక్ష చేయించుకోకుండా ఉంటే అది క్యాన్సర్ కింద మారేదేమో అని చెప్పాను.

Chiranjeevi: అర్థం లేని వార్తలు రాయకండి…
ఈ మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకొని తాను క్యాన్సర్ బారిన పడ్డానని చికిత్స చేయించుకొని కోలుకున్నాను అంటూ వార్తలు రాయడంతో తన శ్రేయోభిలాషులు సన్నిహితులు తన ఆరోగ్యం గురించి ప్రశ్నిస్తూ తనకు మెసేజ్ చేస్తున్నారని చిరంజీవి వెల్లడించారు. దయచేసి ఇలాంటి వార్తలను రాయకండి ఇలాంటి వార్తల వల్ల ఇతరులను బాధపెట్టిన వారు అవుతారు అంటూ ఈ సందర్భంగా చిరంజీవి వార్తలను పూర్తిగా ఖండించారు.
కొద్ది సేపటి క్రితం నేనొక క్యాన్సర్ సెంటర్ ని ప్రారంభించిన సందర్భంగా క్యాన్సర్ పట్ల అవగాహన పెరగాల్సిన అవసరం గురించి మాట్లాడాను. రెగ్యులర్ గా మెడికల్ టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు అని చెప్పాను. నేను అలర్ట్ గా వుండి కొలోన్ స్కోప్ టెస్ట్…
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 3, 2023































