Chiranjeevi interesting comments : కొరటాల దర్శకత్వంలో వస్తున్న ఆచార్య సినిమా పై చాలా అంచనాలు ప్రేక్షకులకు ఉన్నాయి. అసలే మొదటిసారి చిరంజీవి ఆయన తనయుడు రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. ఇంతకు ముందు చరణ్ సినిమాల్లో అలా తళుక్కుమన్నారు చిరు. కానీ ఫుల్ లెన్త్ పాత్రలో కలిసి నటించలేదు. ఇక మెగా అభిమానులకు ఆ కోరిక తీరనుంది. ఇద్దరు కలిసి నటిస్తుండడం సినిమాలో నక్సలైట్ పాత్రల్లో చిరు, చెర్రీ కనిపించనుండడంతో మరింత ప్రేక్షకులలో అంచనాలు పెరిగాయి.

టికెట్ రేట్లు పెంచితే తప్పేంటి….
ఇక ఈ సినిమా బడ్జెట్ కరోనా లాక్ డౌన్ వల్ల బాగా పెరిగిందని అందరు భావించారు. కానీ వాయిదాలు పడుతూ రావడం వల్ల సినిమా కోసం తెచ్చిన అప్పుకి వడ్డీనే 50 కోట్లు అంటూ చిరు మీడియా మీటింగ్స్ లో చెప్పి షాక్ ఇచ్చారు. అసలు సినిమాగురించి చెప్పాల్సిన చిరు సినిమా కోసం చేసిన అప్పు, పారితోషికాల గురించి ఎందుకు మాట్లాడారంటే ఏపీ లో సాగుతున్న టికెట్ రేట్ల ఉదంతం వల్లే. జగన్ సర్కారు టికెట్ రేట్లను తగ్గించడం వల్ల సినిమాలు నష్టపోతాయాని సినిమా పెద్దలు ప్రభుత్వంతో చర్చించడం అన్ని జరిగాయి. ఇక చిరంజీవిని మీడియా టికెట్ రేట్ల విషయంలో మీడియా ప్రశ్న అడిగినపుడు ఎంత బడ్జెట్ లో తెరకెక్కుతోంది అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ సినిమా టికెట్లు పెంచుకోవడంలో ఏ మాత్రం తప్పులేదని ఆయన వెల్లడించారు.
ఇక సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్ద మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వాలకు టాక్స్ వెళ్తున్నప్పుడు ఇలా మనకు అవసరమైనప్పుడు వెసులుబాటు కల్పించాలని అడగడంలో ఏమాత్రం తప్పులేదని మెగాస్టార్ తెలియజేశారు. కరోనా వల్ల అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఇక అదే సమయంలో సినిమా రంగం కూడా బాగా దెబ్బతినింది. కరోనా వల్ల ఆచార్య సినిమా వాయిదా పడుతూ వచ్చిందని దీనివల్ల 50 కోట్లు వాడి కట్టమని ఆ వాటితో చిన్న సైజు సినిమా తీయ్యొచ్చని చెప్పారు. ఇక మా పారితోషికాలు ఇంకా సెటిల్ చేసుకోవాల్సిన ఉందని ఇంతవరకు రెమ్యూనరేషన్ తీసుకోలేదని వివరించారు.



























