ఆంధ్ర సోగ్గాడు అందాల నటుడు శోభన్ బాబుకు మహిళా అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. డ్యూయల్ హీరోయిన్స్ తో ఆయన నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించాయి. నుదుటిపై రింగుతో హీరోయిన్స్ కొంగు పట్టుకొని తిరిగే శోభన్ బాబు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ధర్మపీఠం దద్దరిల్లింది, గోరింటాకు, ఇల్లాలు ప్రియురాలు, శ్రావణ సంధ్య, కార్తీకదీపం, దేవత లాంటి ఎన్నో కుటుంబపరమైన చిత్రాలు మహిళా ప్రేక్షకులను శోభన్ బాబుకు దగ్గర చేశాయి.

ఆ తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన మోసగాడు చిత్రంలో శ్రీదేవి హీరోయిన్ గా శోభన్ బాబు, చిరంజీవి కలిసి నటించారు. ఈ సినిమా హిట్ అయినప్పటికీ వీరిద్దరూ వేర్వేరుగా నటించిన ముగ్గురు మొనగాళ్లు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భిన్నమైన ఫలితాన్ని మూట కట్టుకున్నాయి.

పూర్ణచందర్రావు నిర్మాణ సారథ్యంలో తాతినేని రామారావు దర్శకత్వంలో వచ్చిన ముగ్గురు మొనగాళ్ళు చిత్రంలో శోభన్ బాబు త్రిపాత్రాభినయం చేశారు. ఇందులో అప్పటి నటి లక్ష్మి, రాధిక ఇద్దరూ కలిసి నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది….. చిరంజీవి అద్భుతమైన డ్యాన్సులు ఫైట్ల తో ఆంధ్ర ప్రేక్షకులను ఉర్రూతలు ఊగించారు. 1983 కోదండరాంరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమా తెలుగు చిత్ర గమనాన్ని మార్చివేసింది. అలాగే చిరంజీవికి మాస్ ఇమేజ్ ను తీసుకు వచ్చింది.

ఆ తర్వాత ఆయన సినీ కెరీర్ లో వెనుతిరిగి చూసుకునే పరిస్థితి రాలేదనే చెప్పవచ్చు. శోభన్ బాబు ముగ్గురు మొనగాళ్లు సినిమా వచ్చిన దాదాపు పది సంవత్సరాలకు 1994లో అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్, రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ముగ్గురు మొనగాళ్లు చిత్రంలో చిరంజీవి త్రిపాత్రాభినయం లో నటించారు. నగ్మా, రమ్యకృష్ణ, రోజా హీరోయిన్లుగా ముగ్గురు మొనగాళ్ళు చిత్రంలో నటించారు. వరుసగా జగదేకవీరుడు అతిలోకసుందరి, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు లాంటి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ తో ఉన్న చిరంజీవికి ఈ సినిమా భిన్నమైన ఫలితాన్ని ఇచ్చింది. చిరంజీవి నటించిన ముగ్గురు మొనగాళ్లు చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచిపోయింది.


































