కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం “ఆచార్య”. ఈ చిత్రంలో చరణ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడని వార్తలు వినిపించాయి. అయితే ఆ పాత్ర కోసం రామ్ చరణ్ ను అనుకున్నామని కానీ చరణ్ ఇంకా డేట్స్ ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చారు చిరంజీవి. అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలోని మరో కీలక పాత్రకోసం మెగా డాటర్ నిహారికకు తీసుకోవాలని చిరు భావిస్తున్నారట. ఇప్పటికే పలు సినిమాలలో నటించిన నిహారికకు సినిమాలు పెద్దగా కలిసొచ్చినట్టు లేవు. ఒక తమిళ చిత్రంతో కలిపి కథానాయికగా నాలుగు సినిమాల్లో నటించింది నిహారిక.

అయితే ఆమెకు సినిమాలపై ఆసక్తి ఎక్కువట. దీనిని గమనించిన చిరు, చరణ్ ఇద్దరు కలిపి ఆచార్య సినిమాలో మరో అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారట. ఇదివరకే “సైరా” సినిమాలో నిహారికకు అవకాశం ఇచ్చారు. మరో సారి ఆచార్య సినిమాలో అవకాశం ఇచ్చారట. ఈ అవకాశంతో నిహారిక ఆనందంతో ఏగిరి గంతేస్తుందట. ఈ విషయాన్ని త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నట్లు ఫిలింనగర్ వర్గాల సమాచరం. మరో పక్క నిహారిక వెబ్ సిరీస్ ల నిర్మాణంలో బిజీ బిజీగా గడుపుతుందట.

ఈ చిత్రంలో చిరు సరసన కథానాయికగా కాజల్ నటిస్తోంది. మాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ కలిపి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.



























