మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య అనే సినిమా లో చేస్తున్న సంగతి తెలిసిందే..రీ ఎంట్రీ లో వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్న చిరు చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి.. మరో రెండు సినిమాలు సెట్ చేసే ఆలోచనలో చిరు ఉన్నట్లు తెలుస్తుంది.. ఖైదీ నెంబర్ 150 తో రీ ఎంట్రీ ఇచ్చిన చిరు ఆ తర్వాత సైరా లాంటి సూపర్ హిట్ సినిమా చేశాడు.. ఈ సినిమా తర్వాత మెగా స్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు..
ఎన్నో అంచనాల మధ్య నిర్మితమవుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా, సినిమా పై అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది ఆ మోషన్ పోస్టర్.. కొరటాల శివ స్టైల్ లో మెసేజ్ ఓరియెంటెడ్ కమ్ కమర్షియల్ గా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.. తొలిసారి కొరటాల శివ దేవి శ్రీ ప్రసాద్ ని కాదని మణిశర్మ తో ఈ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మధ్య చిరు వెళ్లిపోవడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఎండాకాలం మొదలుకావడంతో ఉష్ణోగ్రతలను భారీగా నమోదవుతున్నాయి.
ఇక అక్కడి బొగ్గు గనుల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో … అధిక వేడి కారణంగా చిరు స్వల్ప అస్వస్థతకు గురయినట్లుగా సమాచారం. ఈ కారణంగానే షూటింగ్కు కాస్త విరామం చెప్పి .. హైదరాబాద్ వెళ్ళారట చిరంజీవి.ఈ సందర్బంగా సినిమా చిత్రీకరణ నిలిచిపోయిందని తెలుస్తుంది. దీనికి తోడు .. మరో ప్రచారం కూడా జరుగుతుంది. ఈ సినిమాలో బొగ్గు గనుల్లో చిరంజీవికి సంబంధించిన సీన్లు కంప్లీట్ కావడంతో అక్కడి నుండి చిరు హైదరాబాద్ వెళ్లారని మరో టాక్.



























