టాలీవుడ్ లో క్రేజీ కాంబినేషన్ తెరకెక్కనుంది మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కలిసి నటిస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. చిరు, కొరటాల సినిమా పట్టాలెక్కిన విషయం తెలిసిందే. “సైరా నరసింహారెడ్డి” తరువాత చిరంజీవి చేస్తున్న చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు కొరటాల శివ. ఈ మధ్యనే చిరంజీవి, త్రిష లపై ఒక పాటను షూటింగ్ చేసారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దేవాదాయశాఖ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని, దేవాలయాలను నిర్లక్ష్యం చేయడం వలన కలిగే చెడు ప్రభావాలు ఎలా ఉంటాయనేది ఈ చిత్ర అసలు కథ. ఇందులో దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేసే ఒక ఉద్యోగిగా మెగాస్టార్ ఒదిగిపోనున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. చిరంజీవి కొత్త సినిమా గురించి టాలీవుడ్ లో ఎప్పుడూ ఎదో ఒక హాట్ టాపిక్ నడుస్తూనే ఉంటుంది. తాజాగా కెలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారని, అది కూడా విలన్ పాత్రలో నటిస్తున్నారని ఫిలింనగర్ వర్గాల సమాచారం. ఇక ఏముంది ఈ న్యూస్ టాలీవుడ్ లో తెగ వైరల్ అవుతుంది.

అయినా వీళ్లిద్దరి కాంబినేషన్ కోతేమీకాదు ఇదివరకే చాలా చిత్రాలు తెరక్కేకాయి. గతంలో “కొండవీటి దొంగ” అనే సినిమాలో చిరుకి విలన్ పాత్రలో గట్టి పోటీనే ఇచ్చాడు మోహన్ బాబు. ఆ చిత్రం తెలుగునాట ఎంత గొప్ప విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్న అత్యంత గొప్ప నటులలో మోహన్ బాబు ఒకరు. అయన విడులక్షణమైన డైలాగ్ డెలివరీతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు మోహన్ బాబు. ఇక పొతే టాలీవుడ్ లో వీరిద్దరూ “టామ్ & జెర్రీ” లాంటి వాళ్ళు. వీరిరువురి బంధం ఒక విచిత్రమైన బంధం. అప్పటికప్పుడే గొడవపడతారు. మరి కాసేపట్లో బద్దశత్రువుల్లా ఒకరినొకరు మాటలు విసురుకుంటారు. టాలీవుడ్ వజ్రోత్సవ వేడుకల్లో వీరిదద్దరి మధ్య జరిగిన మాటల యుద్ధం కావొచ్చు. ఆ తరువాత చిరంజీవికి పద్మభూషణ్ పురస్కారం అందుకున్నప్పుడు మోహన్ బాబు విమర్శించినా తీరు, దాన్ని కౌంటర్ గా చిరంజీవి ఇచ్చిన సమాధానం. అవన్నీ చుసిన తెలుగు ప్రజలు వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమనేలా ఉందని భావించిన రోజులు ఉన్నాయి. అయితే తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యక్రమంలో వీరిద్దరి మధ్య జరిగిన స్నేహపూరిత సంభాషణలు చుసిన తరువాత వీరిద్దమధ్య ఇంత స్నేహం ఉన్నదా అంటూ తెలుగు ప్రజలు షాక్ అయిన సంగతి తెలిసిందే. ఏది ఏమయినా తెలుగునాట చిరంజీవి – మోహన్ బాబు హీరో, విలన్స్ గా కలిసి నటించడం తెలుగు ప్రేక్షకులకు నిజంగా వరమే. ఈ వార్త నిజమై మోహన్ బాబు తిరిగి తెలుగు సినిమాలు చేస్తే మాత్రం ఇప్పుడున్నా ప్రతినాయకుడి పాత్రల మీద ఆధారపడిన వారికి గడ్డుకాలమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here