Chiyan Vikram : తమిళ టాప్ హీరోల్లో ఒకరైన విక్రమ్ సేతు, మల్లన్న, సమురాయ్, శివపుత్రుడు, నాన్న, అపరిచితుడు, ఐ వంటి సినిమాలతో తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తెలుగులో మల్లన్న, ఐ సినిమాలతో అలరించిన విక్రమ్ ఐ సినిమా తరువాత కొంత జోరు తగ్గింది. ఇక చియాన్ అని అభిమానులతో పిలిపించుకునే విక్రమ్ తనయుడు కూడా అర్జున్ రెడ్డి సినిమా తమిళ రీమేక్ తో ఇండస్ట్రీ కి పరిచయమయ్యాడు. పొన్నియన్ సెల్వన్, కోబ్రా వంటి సినిమాలతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక కోబ్రా సినిమా ఆగష్టు 31 న విడుదల అవుతున్న సందర్బంగా అయన ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.

నన్ను బ్రతికుండగానే చంపేశారు…
ఇక ప్రమోషన్స్ లో పాల్గొన్న విక్రమ్ తనకు నటనంటే పిచ్చని చెప్పారు. అందకే హిట్ ప్లాప్ తో సంబందం లేకుండా ప్రయోగాత్మక సినిమాలు చేస్తూనే ఉంటానని చెప్పారు. కోబ్రా సినిమాలో పది డిఫరెంట్ పాత్రల్లో నటించానని ఇక కొన్ని సన్నివేశాలు రష్యా లోని మైనస్ 40 డిగ్రీల వాతావరణం లో చిత్రికరించాము అయినా రిస్క్ చేయడానికి వెనుకాడలేదని చెప్పారు. మూడేళ్ళ వయసులోనే సినిమాలో నటించానని, నాకు నటన తప్ప వేరే ఏమి తెలియదు అంటూ చెప్పారు. ఇక ఇటీవల అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ వెళితే నేను చనిపోయానని, నా ఫోటో కు దండేసి మరీ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టారు అది చూసాక చాలా బాధేసింది.

ఆ బాధ వల్ల ఐదు రోజులు ఐసీయూ లో ఉండాల్సి వచ్చింది ఇలా ఎందుకు చేస్తారో అర్థం కాదు అంటూ బాధపడ్డారు విక్రమ్. ఇక కోబ్రా సినిమాను సైకలాజికల్ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కించారు డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు. కోబ్రా సినిమాలో విక్రమ్ కి జంటగా ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి నటించింది. మాజీ ఇండియన్ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఇందులో కీలకమైన రోల్ చేశారు. ఇక ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్, ఇక డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు డిమాంటి కాలనీ, అంజలి ఐపీఎస్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు.


































