సినీతారలు ఎందుకు బలవన్మరణానికి పాల్పడుతున్నారు? జీవితాన్నే పణంగా పెట్టి సూసైడ్ లాంటి తీవ్ర నిర్ణయాలను తీసుకోవడానికి ప్రేరేపిస్తున్న పరిస్థితులేమిటి? చిత్ర సీమలో వ్యవస్థలు ఎలా పని చేస్తున్నాయి? కొందరు దర్శకులు ఎమోషనల్‌ బ్లాక్‌ మెయిలింగ్‌ ఎలా చేస్తున్నారు? బలవాన్మరణంకు తెలియని కారణాలు ఎన్నో ఉంటాయి.

సినిమా అవకాశాలు లేకపోవడం వల్లే సూసైడ్‌ చేసుకుంటారనే భావన వుంది. అదొక్కటే నిజం కాదు. ఆత్మాభిమానం భగ్నం కావడం, నమ్మిన విలువలు నమ్మినట్లుండకుండా నయవంచనకు గురి కావడం, మనశ్శాంతి కోల్పోవడం..ఈ కారణాలన్నీ ప్రాణాలు తీసుకోవడానికి ప్రేరేపిస్తున్నాయి. సినిమా రంగంలో ఈ విధంగా ప్రాణాలు తీసుకున్న తారల జీవితాలను పరిశీలిస్తే.. టాలీవుడ్ అతిలోక సుందరి హఠాన్మరణం అందరినీ కలచివేసింది. వెండితెరపై అందంతో పాటు అభినయంతో ఆకట్టుకున్న శ్రీదేవి మరణ వార్త యావత్తు భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. శ్రీదేవి కన్నా ముందు.. శ్రీదేవి మరణం తర్వాత కూడా నిన్నటి బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ వరకూ వెండితెరపై తమ అందచందాలతో, నటనతో ఆకట్టుకున్న ఎంతోమంది హీరోయిన్లు చిన్న వయస్సులోనే తనువు చాలించిన విషాద సంఘటనలున్నాయి. వివరాల్లోకి వెళ్తే..

బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన గురు దత్ మరణం కూడా అనుమానాస్పదమే. నిద్ర మాత్రలను ఎక్కువగా వేసుకోవడంతో పాటు ఆల్కహాల్ సేవించడం వలనే 1964, అక్టోబర్ 10న ఈయన మరణించాడు. కానీ అయితే అది కావాలని జరిగిందా.. లేక బలవాన్మరణమా అనేది మాత్రం ఇప్పటికీ స్పష్టత రాలేదు.

బాలీవుడ్‌లో ఫిమేల్‌ గురుదత్‌గా పేరు తెచ్చుకున్న మీనాకుమారి కూడా తీవ్ర అనారోగ్యంతో 38 ఏళ్ల వయస్సులోనే మృతి చెందిందని తేల్చేశారు. కానీ ఇమె మరణం కూడా హిస్టరీ లో ఓ మిస్టరీగానే వుంది.

బాలీవుడ్ మార్లిన్‌ మన్రో ఎవరంటే ఇప్పటికీ పర్వీన్‌ బాబీ పేరు చెబుతారంటే అతిశయోక్తి కాదు. అమర్‌ అక్బర్‌ ఆంటోని, దీవార్‌, క్రాంతి, షాన్‌ వంటి సినిమాల్లో పర్వీన్‌ నటనకు వీక్షకులు ఫిదా అయ్యారు. కొన్నాళ్లు మానసిక సమస్యలతో ఇబ్బంది పడిన ఆమె 55 ఏళ్ల వయస్సులోనే సూసైడ్ చేసుకుంది. జనవరి 20, 2005న తన ఇంట్లోనే అనుమానాస్పదంగా చని పోయింది. 3 రోజుల తర్వాత ఆమె శవాన్ని చూసారు. ఇప్పటికీ ఈమె మరణంపై స్పష్టత రాలేదు.

బాలీవుడ్ మోడల్ నసీఫా జోసెఫ్ మరణం కూడా నేటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. ఆమె సూసైడ్ చేసుకోవడం వెనుక కారణం కాబోయే భర్త అని రూమర్స్ వచ్చాయి. కానీ క్లారిటీ మాత్రం రాలేదు.

టాలీవుడ్ అతిలోక సుందరి శ్రీదేవికి తన 8వ ఏటనే ప్రాణాపాయం తప్పింది. శోభన్‌బాబు ”నా తమ్ముడు” సినిమాలో ఒక సీన్‌ను తీస్తున్నారు. శ్రీదేవి పరిగెత్తుకుంటూ రోడ్డు దాటే సీన్‌ చేయాల్సింది. ఆ చిత్ర దర్శకుడు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తండ్రి Ks ప్రకాశరావు అయినప్పటికీ ఆ సీన్‌ను రాఘవేంద్రరావు డైరెక్ట్‌ చేశారు. అప్పటికి యువకుడైన రాఘవేంద్ర రావు.. ఇంగ్లీష్ సినిమాల ప్రభావంతో సీన్ సహజంగా రావాలని.. శ్రీదేవిని మద్రాస్ మౌంట్‌రోడ్‌ లో నిజంగానే ట్రాఫిక్‌ లో పరిగెత్తమన్నారు. తాను చేతి రుమాలు ఊపగానే పరుగెత్తుకుంటూ రావాలని సూచించారు. చిన్నపిల్ల కావడంతో అందులో ప్రమాదాన్ని ఆలోచించని శ్రీదేవి.. ఆయన కర్చీఫ్‌ ఊపగానే రోడ్డుకు అడ్డంగా పరిగెత్తేశారు. కన్నుమూసి తెరిచేలోపు.. ఒక కారు ఆమె కాలిని తాకి వెళ్లి పోయింది. శ్రీదేవి కింద పడిపోయింది. అదృష్టవ శాత్తూ దెబ్బలు తగల్లేదు. ఆ సంఘటన జరిగిన తర్వాత రాఘవేంద్ర రావుతో 24 సినిమాలు చేసింది. అలా భారతీయ స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన శ్రీదేవి ఫిబ్రవరి 24, 2018న దుబాయ్‌లోని ఓ పెళ్లికి తన ఫ్యామిలీ మెంబర్స్ తో హాజరై అక్కడే హఠాత్తుగా కన్నుమూసింది. గుండెపోటు నుంచి మొదలై శ్రీదేవి మరణానికి చాలా కారణాలు చెప్పారు. కానీ అసలు కారణం మాత్రం బయటికి రాలేదు. ఆమె మరణం ఇప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలి పోయింది.

ఒకానొక టైంలో దివంగత దివ్యభారతిని శ్రీదేవితో పోల్చారు. శ్రీదేవితో తనను పోల్చడం థ్రిల్‌ కలిగించిందని ఓ ఇంటర్వ్యూలో దివ్య భారతియే స్వయంగా చెప్పారు. ఆమె గొప్ప అందగత్తె అని కొనియాడారు. ఈమె టీనేజ్ వయస్సులోనే బాలీవుడ్, టాలీవుడ్‌లను షేక్ చేసింది. అయితే
ఏప్రిల్ 5, 1993న ముంబై లోని తన అపార్ట్‌మెంట్‌ బాల్కనీ నుంచి కింద పడి చనిపోయింది. అప్పటికి ఆమె వయస్సు 19 ఏళ్లు. దివ్యను హత్య చేసారని కొందరంటున్నారు.. మరికొందరు మాత్రం ప్రమాదవశాత్తూ చనిపోయిందంటారు. సో.. బాలీవుడ్ నే షేక్ చేసిన దివ్యభారతి మరణం వెనుక రహస్యం ఇప్పటికీ వెలుగులోకి రాలేదు.

టాలీవుడ్ లో వాంప్ క్యారెక్టర్స్ కీ.. ఐటం సాంగ్స్ కీ ఆరోజుల్లోనే మంచి క్రేజ్ ను సంపాదించుకున్న శృంగార తార సిల్క్ స్మిత 1996, డిసెంబర్ 23న చెన్నైలోని తన సొంతింట్లోనే చనిపోయింది. ఈమె మరణానికి సినిమా కెరీర్ సమస్యలతో పాటు కొన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా కారణమయ్యాయని టాలీవుడ్ టాక్. కానీ కొందరు మాత్రం సిల్క్ మరణంపై అనుమానాలు కూడా వ్యక్తం చేసారు.

హిందీతోపాటు దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ నటించిన సౌందర్య కూడా అందం, అభినయంతో తెలుగు వారికి దగ్గరైంది. అయితే 32 ఏళ్ల వయస్సులో 2004లో జరిగిన హెలికాఫ్టర్‌ ప్రమాదంలో సౌందర్య ప్రాణాలు కోల్పోయారని వార్తలొచ్చాయి. కానీ సౌందర్య మరణం వెనుక వేరే కారణాలున్నట్లుగా అప్పట్లో సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి.

పదహారేళ్లకే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆర్తీ అగర్వాల్ తెలుగులో చాలా హిట్‌ చిత్రాల్లో నటించింది. బేరియాట్రిక్‌ సర్జరీ కోసం విదేశాలకు వెళ్లి.. శస్త్ర చికిత్స జరుగుతుండగా… గుండె ఆగి పోవడంతో 31ఏళ్ల వయస్సులోనే మృతి చెందినట్లు ఆర్తీ అగర్వాల్ ఫ్యామిలీ నిర్ధారించింది కానీ ఆమె మరణం కూడా ఓ మిస్టరీగానే మిగిలిపోయింది.

తెలుగు చిత్రాలతో పాటు తమిళ, మలయాళ చిత్రాలలో కూడా స్టార్‌ హీరోయిన్ గా ఎదుగుతున్న తెలుగమ్మాయి ప్రత్యూష ఫిబ్రవరి 23, 2002న చనిపోయింది. ఈమె మరణం ఇప్పటికీ మన టాలీవుడ్ హిస్టరీలో ఓ మిస్టరీనే.

నిశ్శబ్ధ్, గజిని, హౌజ్ ఫుల్ లాంటి సినిమాలతో బాలీవుడ్‌లో మంచి గుర్తింపును సంపాదించుకున్న యంగ్ హీరోయిన్ జియా ఖాన్ 2013, జూన్ 3న తన ఇంట్లోనే చనిపోయింది. అయితే ఈమె మరణం వెనక బాలీవుడ్ హీరో సూరజ్ పంచోలీ హస్తం వుందంటూ జియాఖాన్ తల్లి ఆరోపించడం విశేషం.

ప్రియా రాజవంశ్.. మార్చి 27, 2000న మరణించిన ఈమె మరణంపై క్లారిటీ లేకపోయినా ఆ తర్వాత ఆమె భర్తే చంపేసాడని దర్యాప్తులో తేలింది.

హాలీవుడ్ శృంగార దేవత మార్లిన్ మన్రో 1962లో మరణించింది. ఆమె మరణానికి ఇప్పటికీ ఓ క్లారిటీ రాలేదు. మార్లిన్ మన్రో ది అంటున్నా కూడా చాలామంది ఈమెది హత్యే అనే స్ట్రాంగ్ గా వాదించే వాళ్ళున్నారు.

1973, జులై 20న మరణించిన సెన్సేషనల్ హీరో బ్రూస్లీ మరణం కూడా ఇప్పటికీ మిస్టరీనే. ఈయన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి చంపేసారు అని ఇప్పటికీ ప్రచారం జరుగుతుంది.

జూన్ 14, 2020న బాలీవుడ్ హీరో సుశాంత్ సూసైడ్ చేసుకుని 4 నెలలవుతున్నా ఇప్పటికీ ఈయన మరణం వెనుక దాగివున్న రహస్యాలు బయటికి రాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here