సినిమా సెట్స్ లో ఏర్పడిన పరిచయం పెళ్ళిళ్ళకి దారితీస్తోందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.

సమంత నాగ చైతన్య, నాగార్జున అమల, ప్రకాష్ రాజ్ లలితకుమారి, రాధిక శరత్ కుమార్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో నటీనటులు పెళ్లి చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు.
హీరో సూర్య-జ్యోతిక:

తమిళ్ తెలుగు సినిమాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగిన సూర్య చంద్రముఖి పాత్రలో నటించి సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న జ్యోతికాని వివాహమాడాడు. 1999లో పూవెల్లం కెట్టుప్పర్ తమిళ చిత్ర షూటింగ్ లో కలసి నటించిన వీళ్లిద్దరు ఒకరినొకరు ఇష్టపడి 2006వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు.
అజిత్ కుమార్- షాలిని:

ఎంతవాడుగాని సినిమాలో మంచి తండ్రిగా నటించి తెలుగు తమిళ ప్రేక్షకుల మనసులను చూరగొన్న అజిత్ కుమార్ గతంలో స్వాతి, హీరో రాజ్ కుమార్ అనే ఇద్దరు యువతులతో డేటింగ్ చేసినట్టు నివేదికలు ఉన్నాయి. అయితే 1999వ సంవత్సరంలో అమరకాలం సినిమా చిత్రీకరణలో తన కో-యాక్టర్ అయిన షాలిని ని బాగా ఇష్టపడిన అజిత్ కుమార్ ఆమెతో కొన్నేళ్లపాటు డేటింగ్ చేశాడు. రమేష్ కన్నా వంటి సినీ ప్రముఖులు నటీమణులను పెళ్లి చేసుకోవద్దని అతడిని చాలాసార్లు చెప్పారు కానీ అవేమీ పట్టించుకోకుండా అజిత్ కుమార్ శాలినికి 1999 జూన్ నెలలో ప్రపోజ్ చేశాడు. ఏప్రిల్ 2000 సంవత్సరం లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు.
అభిషేక్ బచ్చన్-ఐశ్వర్య రాయ్:

ఈ భూమి మీద నడిచిన అత్యంత అందగత్తెల లో ఒకరైన ఐశ్వర్యారాయ్ జీవితంలో ఎన్నో చేదు అనుభవాలు చోటుచేసుకున్నాయి. సల్మాన్ ఖాన్ ఆమెకు బ్రతికుండగానే నరకం చూపించాడని సినీ వర్గాలు అప్పట్లో పెద్ద పెద్ద వార్తలే రాసాయి. అతనిని వదిలించుకున్న తర్వాత వివేక్ ఒబెరాయ్ తో డేటింగ్ చేసిన ఐశ్వరరాయ్ కొంతకాలం తర్వాత అతడిని కూడా వదిలేసింది. అప్పటికే అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యారాయ్ మంచి స్నేహితులుగా ఉండేవారు. అప్పటికే వాళ్ళు ఇద్దరు కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు కూడా. కానీ 2005లో వచ్చిన బంటి ఔర్ బబ్లు లో కజరారే పాటలో అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ కలిసి నృత్యం చేశారు. ఈ క్రమంలోనే ఐశ్వర్యరాయ్ పై మనసు పరేసుకున్నాడు అభిషేక్ బచ్చన్. అప్పటికే తాను కరిష్మా కపూర్ తో నిశ్చితార్ధం చేసుకుని తర్వాత పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయాడు. బంటి ఔర్ బబ్లు సినిమా తర్వాత ఉమ్రావ్ జాన్, గురు మరియు ధూమ్ 2 వంటి చిత్రాల్లో వరుసగా నటించారు. ఈ మూడు సినిమాలు చిత్రీకరణ సమయంలో ఒకరినొకరు ఇష్టపడడం ప్రారంభించారు. ధూమ్ టు చిత్రంలో బాగా దగ్గరైన వీళ్లు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. గురు సినిమా మొదటి ప్రదర్శన ప్రసారం చేసిన తర్వాత తాను యార్క్ నగరంలో ఐశ్వర్య రాయ్ కి ప్రపోజ్ చేయగానే ఆమె అతడి ప్రేమను అంగీకరించింది. జనవరి 14 2007న నిశ్చితార్థం చేసుకున్నారు. ఏప్రిల్ 20 2007న పెళ్లి చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు. వాళ్లకి ఆరాధ్య బచ్చన్ అనే క్యూట్ అమ్మాయి కూడా జన్మించింది.
ఊర్వశి – మనోజ్ కే.జయన్:

ఊర్వశి(కవితా మనోరంజని) తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు అయిన మలయాళ తమిళ నటి తన కో యాక్టర్ అయిన మనోజ్ కే.జయన్ ని 1999వ సంవత్సరంలో పెళ్లాడింది. కానీ ఏవో మనస్పర్థల కారణంగా వాళ్ళిద్దరూ 2008వ సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు. మళ్లీ ఆమె 2013వ సంవత్సరంలో శివ ప్రసాద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.
నిరోషా రాధా- రాంకీ:

శ్రీలంక దేశంలోనే కొలంబో లో జన్మించిన నిరోషా రాధా భారతీయ టెలివిజన్ సీరియల్స్ లలో నటించి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. ఆ తర్వాత తమిళ తెలుగు కన్నడ మలయాళం వంటి చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన అత్తింట్లో అద్దె మొగుడు సినిమాలో హీరోయిన్ గా ఈమె నటించింది. అయితే 1995 సంవత్సరంలో ఈమె తన యాక్టర్ అయిన రాంకీ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రముఖ సీనియర్ హీరోయిన్ రాధికా ఆమెకు సోదరి మణి అవుతుంది.
సమంత- అక్కినేని నాగ చైతన్య:

ఏం మాయ చేసావే సినిమా లో హీరో హీరోయిన్ గా నటించిన సమంత, అక్కినేని నాగ చైతన్య ఆటోనగర్ సూర్య చిత్రీకరణ సమయంలో ప్రేమలో పడి, 2016వ సంవత్సరంలో ప్రపోజ్ చేసుకుని, 2017 జనవరి 29వ తేదీన నిశ్చితార్థం చేసుకున్నారు. అదే సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. టాలీవుడ్ పరిశ్రమలో వీళ్లిద్దరి అత్యంత ముచ్చటైన జంట గా చెప్పుకోవచ్చు.
మహేష్ బాబు-నమ్రత శిరోద్కర్:

1993వ సంవత్సరంలో మిస్ ఇండియా గా ఎంపిక కాబడిన నమ్రతా శిరోద్కర్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 2005వ పెళ్లి చేసుకున్నారు. 2000వ సంవత్సరంలో వంశీ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన నమ్రతా శిరోద్కర్ మహేష్ బాబు సినిమా ముహూర్తం పెట్టే సమయంలో కలుసుకున్నారు. మొదటి చూపులోనే ఒకరిని ఒకరు ని బాగా ఇష్టపడ్డారు కానీ తమ ఇష్టాలను ఎవరితో పంచుకోలేదు. వంశీ సినిమా సెట్స్ లో ఇద్దరూ బాగా మాట్లాడుకుంటూ బాగా ఎంజాయ్ చేసే వారట. సినిమా చిత్రీకరణ పూర్తయిన అనంతరం వీళ్ళిద్దరూ డేటింగ్ చేసుకోవడం ప్రారంభించారు. ఇలా అయిదు సంవత్సరాల పాటు బాగా ప్రేమలో మునిగి తేలుతూ 2020 సంవత్సరం లో ప్రైవేటు సెరిమోనీ లో వివాహం చేసుకున్నారు.
దేవదర్శిని- చేతన్:

2002 లో దేవదర్శిని టెలివిజన్ నటుడు చేతన్‌ను వివాహం చేసుకున్నాడు. వారు మొదట మర్మదేశంలో సినిమాలో కలిసి పనిచేశారు. దేవదర్శిని కాంచన సినిమా లో రాఘవ లారెన్స్ కి వదిన పాత్రలో నటించింది. ఆమె కూతురు నియతి కూడా సినిమాల్లో నటిస్తోంది.



























