చైనాతో పాటు ప్రపంచాన్ని గజ గాజా వణికిస్తుంది కరోనా వైరస్.. చైనాలో మొదలైన ఈ వైరస్ అక్కడ చాలా మంది మరణానికి కారణమైంది. ఈ వైరస్ ఎఫక్ట్ ప్రపంచంలోని అన్ని రంగాలపై పడింది. అయితే గత వారం రోజులుగా మన రాష్ట్రంతో పాటు దేశంలోని పలు రాష్ట్రాలలో ప్రజలను భయపెడుతున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై అప్రమత్తమై పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ లో కరోనా కేసులు నమోదైన కారణంగా ప్రజలలో ఒక రకమైన భయం పట్టుకుంది. ఈ ప్రభావం షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్ వంటి వాటిపైనే కాకుండా స్టాక్ మార్కెట్ పైన కూడా పడింది.

ఇప్పటికే చాలా వరకు ప్రజలు వైరస్ ప్రభావంతో సినిమా థియేటర్స్, షాపింగ్ మాల్స్ కు వెళ్లడం తగ్గించారు. కొన్ని థియేటర్స్ ఖాళీగా బోసిపుతున్న విషయం తెలిసిందే. చైనాలో దేశవ్యాప్తంగా ఉన్న పలు థియేటర్స్ ఇప్పటికే మూసివేశారు. కొత్త సినిమాల విడుదలను కూడా ఆపేసారు. ఎక్కువ మంది గుమిగూడి ఉండే ప్రదేశాలలో ఈ వైరస్ వ్యాప్తిచెందే అవకాశం ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

తాజగా మన దేశంలోని కేరళ రాష్ట్రంలో కరోనాకు సంబంధించిన మరో ఆరు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో తక్షణ చర్యల్లో భాగంగా అధికముగా ప్రజలు గుమిగూడి ప్రాంతాలైన సినిమా థియేటర్స్, షాపింగ్ మాల్స్, ఎక్జిబిషన్స్ వంటి వాటిని ఈ నెల 31వరకు మూసి వేస్తున్నట్టు చెప్పారు. వెకెండ్ వస్తే ప్రజలతో కిటకిటలాడే థియేటర్లు కరోనా కారణంగా ప్రేక్షకులు థియేటర్ వైపు రావడం తగ్గించారు. మరో వైపు కొన్ని కొత్త చిన్న సినిమాలు రిలీజ్ అయినా కలెక్షన్లు మాత్రం పెద్దగా కనిపించడం లేదు. కరోనా దెబ్బకు అసలు సినిమాలు చూసే ఆలోచనలు చేయడం లేదు ప్రజలు. టాలీవుడ్ లో ఓ పిట్టకథ, పలాస 1978 సహా మరో మూడు చిన్న సినిమాలు విడులయ్యాయి కానీ ఆడియన్స్ కి మాత్రం అవి వచినట్టుకు కూడా పెద్దగా తెలియదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here