Sarkaru Vaari Paata:టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ మే 12వ తేదీ విడుదల అయింది. ఈ క్రమంలోనే ఈ సినిమా మొదటి షో నుంచి అద్భుతమైన కలెక్షన్లను రాబట్టి మంచి విజయాన్ని అందుకుంది.

ఇక ఈ సినిమాని అభిమానుల నుంచి మొదలుకొని సెలబ్రిటీల వరకు వీక్షించి సినిమాపై వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ క్రమంలోనే మహేష్ సర్కారు వారి పాట సినిమా పై ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించి ట్వీట్ చేయగా తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డి దంపతులు కూడా ఈ సినిమాని చూశారు. ఈ క్రమంలోని సినిమా చూసిన అనంతరం జగన్ సతీమణి భారతి ఈ సినిమాపై రివ్యూ ఇచ్చారు.

ఈ సందర్భంగా మీడియాతో భారతి మాట్లాడుతూ సినిమా చాలా బాగుందని తెలియజేశారు. తనకు మహేష్ బాబు సినిమాలంటే చాలా ఇష్టమని తప్పకుండా అతని సినిమాలు చూస్తానని ఈమె ఈ సందర్భంగా వెల్లడించారు. ముఖ్యంగా డబ్బు విషయంలో మహేష్ బాబు నటన ఎంతో అద్భుతంగా ఉందని ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంది అంటూ భారతి ఈ సినిమా గురించి రివ్యూ ఇచ్చారు.
నేను విన్నాను… నేను ఉన్నాను..
ఇక ఈ సినిమాలో తనకు ఇష్టమైన డైలాగ్ నేను విన్నాను నేను ఉన్నాను అనే డైలాగ్ తనకు ఎంతగానో నచ్చిందని భారతి తెలియజేశారు. అయితే గత ఎన్నికల సమయంలో జగన్ మోహన్ రెడ్డి కూడా ఇదే డైలాగ్ ఉపయోగించి ఎన్నికలలో విజయం సాధించారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు సినిమాలో కూడా ఈ డైలాగ్ పెట్టడంతో సినిమాకు మరింత హైప్ ఏర్పడిందని చెప్పవచ్చు.





























