ప్రముఖ వైద్యుడు ఈసీ గంగిరెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. గంగిరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు స్వయానా మామ. వైఎస్ జగన్ సతీమణి భారతి తండ్రి ఈసీ గంగిరెడ్డి. అయన గత కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.

ఆరోగ్యం విషమించడంతో అయన నిన్న అర్ధరాత్రి (2020, అక్టోబర్ 2, శుక్రవారం) తుదిశ్వాస విడిచారు. ఆయన పులివెందులలో పేదల వైద్యుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాదు 2001 – 2005 లో అయన పులివెందుల ఎంపీ గా కూడా పనిచేసారు. ఈసీ గంగిరెడ్డి మరణంతో ఏపీ సీఎం జగన్ నివాసంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ఇటీవలే సీఎం జగన్ తన ప్రత్యేక విమానంలో రేణిగుంట నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకొని అక్కకి నుంచి గచ్చిబౌలి లోని కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మామ ఈసీ గంగిరెడ్డిని పరామర్శించారు.




































