ఏపీలో కోవిడ్ పరిస్థితుల పై సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజా బాహుళ్యంతో సంబంధాలు ఉన్నవారికి వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యం ఇవ్వాలని జగన్ అధికారులను సూచించారు. ఉపాధ్యాయులు సహా ప్రభుత్వ సిబ్బందికి వ్యాక్సినేషన్ త్వరగా చేయాలన్నారు. గ్రామాలను యూనిట్‌గా తీసుకొని వ్యాక్సిన్ వేయాలని ఆదేశించారు.

కాగా ఆధార్‌కార్డు నంబర్‌తో ఆరోగ్యశ్రీ కార్డులను లింక్‌చేయాలని అధికారులను జగన్ ఆదేశించారు. గ్రామాల నుంచి ఆసుపత్రుల వరకు సిబ్బంది నియామకం జరగాలని సూచించారు.




























