లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో వైన్స్, బార్ లు మూతపడ్డాయి. మందు దొరక్క మందుబాబులు పడే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. మందు దొరక్క కొంతమంది వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. మరికొంత మంది ఏకంగా ఆత్మహతలకే పాల్పడుతున్నారు. ఇలాంటి వారితో ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నిండిపోతోంది. రోజు రోజుకు ఇటువంటి కేసుల సంఖ్య పెరుగుతూవస్తోంది.

ఈ నేపథ్యంలో రాష్టంలోని వైన్ షాపులు ఎట్టిపరిస్థితుల్లోనూ తెరవడం జరగదని తేల్చి చెప్పారు సీఎం కేసీఆర్. ఈ విషయంలో ప్రభుత్వానికి మరో ఆలోచనే లేదని ఖరాఖండిగా చెప్పేసారు. ఎవరు డిమాండ్ చేసినా సరే ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కి తగ్గేదిలేదని కుండబద్దలు కొట్టారు. కరోనా వ్యాపిస్తున్న ఈ సమయంలో ప్రజలంతా ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు.

అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఈ ప్రకటన మందుబాబులకు మింగుడు పడటంలేదు. లాక్ డౌన్ పొడిగించిన వైన్స్, బార్ లకు షరతులతో కూడిన మినహాయింపు ఇస్తారని మందుబాబులంతా భావించారు. సీఎం వ్యాఖ్యలతో వారి ఆశలన్నీ ఆవిరైపోయాయి.





























