ఎపుడో “కలర్స్” అనే బుల్లితెర ప్రోగ్రాంలో యాంకర్ గా పరిచయమై.. ఆ తరువాత వెండితెరపై అరంగేట్రం చేసి ముందు సైడ్ రోల్స్… ఆ తరువాత హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను మెప్పించింది కలర్స్ స్వాతి. తెలుగులో కొన్ని సినిమాలు హిట్ అయినా కూడా పెద్దగా అవకాశాలు రాలేదనే చెప్పాలి. అయితే తెలుగు హీరోయిన్స్ అంటే ఉండే చిన్న చూపువల్ల తెలుగులో పెద్దగా సక్సెస్ కాలేకపోయిన ఈ అమ్మడు తమిళంలో మాత్రం సూపర్ క్రేజ్ సంపాదించింది. అయితే కెరీర్ లో ఆఫర్లు తగ్గిన సమయంలో పెళ్లి పీటలు ఎక్కింది ఈ ముద్దగుమ్మ.

కాగా 2018 లో తన స్నేహితుడి సోదరుడు వికాస్ వాసు ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. రెండు సంవత్సరాల పాటు సాగిన వారి సంసారం అంతగా సాగడం లేదని, వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. గతంలో జరిగిన గొడవలను పెద్దలు సర్ది చెప్పారని, తాజాగా మరో సారి వీరిద్దరి మధ్య పెద్ద వివాదం చెలరేగడంతో స్వాతి, వికాస్ విడాకుల దిశగా అడుగులు వేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాల్సి ఉంది.

పెళ్లి తరువాత తన భర్తతో కలిసి విదేశాలలో ఉంటున్న స్వాతి, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా తన స్వాతి సోషల్ మీడియాలో తన పెళ్లి ఫోటోలను డిలీట్ చేసింది. స్వాతి సడెన్ గా తన పెళ్లి ఫోటోలను డిలీట్ చేయడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఈ విషయం వైరల్ గా మారి స్వాతి విడాకుల దిశగా పయనిస్తుందా అంటూ ఫిలింనగర్ వర్గాల్లో వాడి వేడి చర్చ జరుగుతుంది.

































