ఎపుడో “కలర్స్” అనే బుల్లితెర ప్రోగ్రాంలో యాంకర్ గా పరిచయమై.. ఆ తరువాత వెండితెరపై అరంగేట్రం చేసి ముందు సైడ్ రోల్స్… ఆ తరువాత హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను మెప్పించింది కలర్స్ స్వాతి. తెలుగులో కొన్ని సినిమాలు హిట్ అయినా కూడా పెద్దగా అవకాశాలు రాలేదనే చెప్పాలి. అయితే తెలుగు హీరోయిన్స్ అంటే ఉండే చిన్న చూపువల్ల తెలుగులో పెద్దగా సక్సెస్ కాలేకపోయిన ఈ అమ్మడు తమిళంలో మాత్రం సూపర్ క్రేజ్ సంపాదించింది. అయితే కెరీర్ లో ఆఫర్లు తగ్గిన సమయంలో పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంది ఈ ముద్దగుమ్మ.

తాజాగా ఎవరో ఆకతాయిలు తన పేరుతో నకిలీ ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసారు. దీనిపై ఆమె మండిపండింది. ఎవరో తన పేరుతొ ఫెక్ ఐడి క్రియేట్ చేసారు… దయచేసి ఎవరు దాన్ని ఫాలో అవ్వకండి అంటూ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో తెలిపింది. అంతేకాకుండా ఈ ఫెక్ అకౌంట్స్ క్రియేట్ చేసేవాళ్ళు ఇలాంటివి కాకుండా ఏవైనా మంచి పనులు చేస్తే బాగుండేది అంటూ వారికి చురకలు అంటించింది. “వారం రోజుల తరువాత సోషల్ మీడియాలోకి వచ్చాను.. నకిలీ ప్రొఫైల్ చూసాను. నాకు ట్విట్టర్ లో అసలు ఎటువంటి అకౌంట్ లేదు. ఫెస్ బుక్ లో కూడా 2011 నుంచే వైదొలిగాను” అంటూ చెప్పుకొచ్చింది. అసలు ఇంస్టాగ్రామ్ లో కూడా ఎందుకు ఉన్నానో నాకే తెలియదు. ఈ విషయాన్నీ నా దృష్టికి తీసుకొచ్చిన వారికి నా కృతఙ్ఞతలు. ఇప్పటికైనా నా పేరున క్రియేట్ చేసిన ఆ ఫేక్ అకౌంట్ వెంటనే తొలగించాలి ఒకవేళ వారు తొలగించకపోతే సైబర్ క్రైం వారికీ కంప్లైంట్ చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది. అదేసమయంలో తనకు నకిలీ అకౌంట్ల మధ్య ఉండాలని లేదని, మళ్ళీ పాత రోజులకు వెళ్లాలని ఉందని తన ఇంస్టాగ్రా లో రాసుకొచ్చింది.




























