Comedian Krishna Bhagavan in cash show : కృష్ణ భగవాన్ తెలుగు సినిమాల్లో కమెడియన్ గా తనకోక సెపరేట్ స్టయిల్ తో టైమింగ్ పంచులతో అలరించారు. ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా ఒక వెలుగు వెలిగారు. ఆయన టైమింగ్ పంచులకు చాలా మంది అభిమానులను పెంచుకున్నారు. ఈ మధ్యకాలంలో వెండి తెరకు దూరమైన కృష్ణ భగవాన్ మళ్ళీ ఈటీవీ క్యాష్ కార్యక్రమంలో కనిపించారు. అనారోగ్య సమస్యలతో సినిమాలకు దూరమైనా కృష్ణ భగవాన్ తన టైమింగ్ పంచులను మాత్రం మిస్ అవ్వలేదు. క్యాష్ కార్యక్రమంలో తనదైన శైలి పంచులతో కేక పుట్టించారు.

క్యాష్ కార్యక్రమంకు సంబంధించిన లేటెస్ట్ ప్రోమోను ఈటీవీ వాళ్లు యూ ట్యూబ్ లో విడుదల చేసారు. ఈ షో కోసం హేమ, సమీర్, పోసాని కృష్ణ మురళీ, కృష్ణ భగవాన్ వచ్చారు. హేమ సమీర్, పోసాని చాలా సార్లు క్యాష్ షో కి వచ్చారు. అయితే కృష్ణ భగవాన్ రావడం ఇదే తొలిసారి. ఇక ఆయన టైమింగ్ పంచులతో ప్రోమో మొత్తం నవ్వులు పూశాయి.

అన్ని రఘుబాబే…..
ఇక కార్యక్రమంలో సుమ కృష్ణ భగవాన్ ను ఉద్దేశించి ప్రశ్న అడిగారు..మీరు మీ లైఫ్‌లో చాలా ఆశ్చర్యానికి గురైన సందర్భాలున్నాయా? అని సుమ అడిగింది. రఘుబాబు, ఇంకో ఆవిడకు నంది అవార్డు రావడం అని కృష్ణ భగవాన్ సమాధానం ఇచ్చాడు. ఇక మిమ్మల్ని ఇండస్ట్రీ లో ఎవరైనా తొక్కేసారా… అని అడుగగా రఘు బాబు అని సమాధానం చెప్పారు ఇక ఎవరినైనా తుక్కు తుక్కు మని కొట్టమంటే ఎవరిని కొడతారు అని అడుగగా రఘు బాబుని అంటూ ఫన్నీ గా సమాధానం చెప్పారు. ఇక మీ కుటుంబంలో అందరు మీతో ఎలా ఉంటారు అని అడుగగా రఘు బాబు ల ఉంటారు అంటూ సమీర్ కృష్ణ భగవాన్ కి బదులుగా కౌంటర్ వేస్తాడు. ఎలా ప్రోమో ఆద్యంతం నవ్వులతో ఉన్నా ఈ షో ద్వారా హల రోజుల తర్వాత కృష్ణ భగవాన్ కనిపించబోతున్నారు.































