కమెడియన్ మహేష్ ఈ పేరు తెలియని ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఎవ్వరూ ఉండరు. ఒక ప్రముఖ ఛానల్ లో ప్రసారమయ్యే క్రేజీ షో జబర్దస్త్ ప్రోగ్రామ్ నుంచి పరిచయమైన చాలా మంది కమెడియన్లలో మహేష్ ఒకరు. ఈ ప్రోగ్రాం నుంచి పరిచయమైన ప్రతి కమెడియన్ మంచి క్రేజ్‌ని సంపాదించి బుల్లి తెర నుంచి సినిమాల వరకు ఎదిగినవారే. వారిలో ఈ మహేష్ కూడా ఒకరని చెప్పాలి. జబర్దస్త్ తొలినాళ్లలో మహేష్ కిరాక్ ఆర్.పి. టీమ్‌లో మెయిన్ కంటెస్టెంట్ అని చెప్పాలి. జబర్దరస్త్ షోలో తనదైన శైలితో కామెడీని పండించి ఎన్నో స్కిట్లను కొట్టాడు. జబర్దస్త్ షో చేస్తుండగానే మహేష్‌కి టాలీవుడ్ సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది.

ముందు శర్వానంద్ హీరోగా నటించిన శతమానం భవతి అనే చిత్రంలో నటించి మంచి మార్కులే కొట్టేశాడు, ఆ తర్వాత కీర్తి సురేష్ నటించిన మహానటి చిత్రంలో ఓ చిన్న నెగిటివ్ క్యారెక్టర్లో మెప్పించాడు. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్ నటించిన రంగస్థలం చిత్రంలో హీరో ఫ్రెండ్ పాత్రలో నటించి నటుడిగా తానేంటో నిరూపించుకున్నాడు. ఇక తన వంతుగా హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. నేనే నాగార్జున అనే సినిమాలో హీరోగా నటించగా 2019లో విడుదల అయ్యి పరాజయం పాలయ్యింది.

1990 లో ఈస్ట్ గోదావరి జిల్లాలో పుట్టిన మహేష్ పూర్తి పేరు మహేష్ ఆచంట. తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది ఏంటంటే కమెడియన్ మహేష్ త్వరలో ఓ ఇంటి వాడు కానున్నాడట. ఈమధ్య తనకు కాబోయే భార్యతో కలిసి ఉన్న కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవలె ఆయనకు పెళ్ళి కుదిరిందని సమాచారం. లాక్డౌన్ పూర్తవగానే మహేష్ పెళ్ళి చేసుకోబోతున్నట్లు సమాచారం.




























