Comedian Pakiza : తమిళ నటి వాసుకి అంటే ఎవరూ గుర్తు పట్టకపోవచ్చు కానీ తెలుగులో పాకీజా అంటే మాత్రం అందరూ గుర్తుపడతారు. బ్రహ్మానందం, పాకీజా కామెడి 90 దశకంలో వచ్చిన ఎన్నో సినిమాలలో సూపర్ హిట్ అయింది. తెలుగులో దాదాపు 100 కి పైగా సినిమాల్లో నటించిన పాకీజా సినిమా అవకాశాలు తగ్గాక తెలుగు తెరకు దూరమైంది. అయితే చాలా కాలం తరువాత చెన్నై లో తెలుగు మీడియా ప్రతినిధికి కనిపించిన పాకీజా ప్రస్తుతం ఆమె ఆర్థిక ఇబ్బందులతో తిండి గడవడం కూడా కష్టంగా మారి ఇబ్బందులు పడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ కి వస్తే ఏదో ఒక పనిచేసైనా బతుకుతా…
పాకీజా జయలలిత గారు బ్రతికి ఉన్నంత వరకు ఆర్థికంగా బాగానే ఉన్నాను అంటూ తెలుపుతూ ఆమె మరణించాక ఎవరూ పట్టించుకోలేదని ఆర్థిక ఇబ్బందులతో పూట గడవడం కష్టంగా ఉందంటూ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కి వచ్చి అక్కడ సీరియల్స్ లో అయినా నటించినా కొంత డబ్బు సంపాదించుకుంటాను. అది కుదరక పోతే కనీసం చిరంజీవి, బాలకృష్ణ వంటి వారింట్లో పనికచేసుకుంటాను అంటూ ఎమోషనల్ అయ్యారు.

కనీసం విజయవాడ దుర్గ గుడి దగ్గర అడుక్కు తినయినా బ్రతుకుతాను అంటూ ఏపీ కి రావాలనుకుంటున్నట్లు తెలిపారు. తమిళనాడు రాష్ట్రంలో ఎవరూ నన్ను పట్టించుకోలేదంటూ తెలిపారు. నడిగర్ సంఘం కి అలానే అందరు అగ్ర హీరోలకు వాట్సాప్ వీడియోలను పంపినా ఎవరూ పట్టించుకోలేదని ఎమోషనల్ అయ్యారు వాసుకి.



























