బాల్కనీ లోంచి డబ్బులు విసిరేవాడు శ్రీహరి.. : పృథ్వీరాజ్

0
535

నటుడు పృద్విరాజ్ తాజగా రియల్ స్టార్ శ్రీహరిపై కొన్ని ఆశక్తికర వ్యాఖ్యలు చేసారు. ఈ క్రమంలో ఈటీవీలో ప్రసారం అవుతున్న ‘క్యాష్‌’ షో లో హాస్యనటులు పృథ్వీరాజ్‌, బెనర్జీ, సుదర్శన్‌, జ్యోతి పాల్గొని సందడి చేశారు. ఈ సందర్బంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ..

రియల్‌స్టార్‌ శ్రీహరి వేల సంఖ్యలో దానాలు చేశారని అన్నారు. ఆపద అని ఎవరైనా అయన ఇంటి ముందుకు వెళ్లి అడగగానే శ్రీహరి అయన బాల్కనీలోంచి డబ్బులకు రాయికట్టి దానిని గుడ్డలో చుట్టి రోడ్డుపైకి విసిరేసేవారని ఆయన గుర్తు చేసుకున్నారు.

ఇదే కార్యక్రమంలో బెనర్జీ.. హీరో ఉదయ్‌కిరణ్‌ గురించి మాట్లాడుతూ.. ”ఉదయ్‌కిరణ్‌ మరణం ఒక విధి. లవర్‌బాయ్‌గా అతనికి మంచి ఇమేజ్‌ వచ్చింది. కానీ తర్వాత ఏదో తప్పు జరిగింది. ‘నీకు పెళ్లైంది.. నీకు ఒక భార్య వచ్చింది. సినిమాలు చేస్తున్నావు.. జీవితాన్ని ఎంజాయ్‌ చెయ్‌’ అని నేను చెప్పేవాడిని. కానీ.. అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది’ అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సుమ తనదైన పంచులతో అలరించగా కమెడియన్లు డైలాగ్‌లు, టాస్క్‌లతో సందడి చేశారు. కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here