Comedian Pruthvi Raj : థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనగానే పృథ్వీ రాజ్ గుర్తొస్తాడు. సినిమాల్లో ఎన్నో పాత్రలను చేసినా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ మాత్రం బాగా గుర్తింపు పొందింది. ఇక సినిమాల్లో కమెడియన్ గా కొనసాగుతూ రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఇక రాజకీయాల్లో వైసీపీ లో చేరి జగన్ తరుపున ప్రచారం చేసిన పృథ్వీ టీటీడీలో ఎస్విబిసి చానెల్ కి చైర్మన్ గా పనిచేసారు. అయితే ఆ సమయంలో లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆ పదివి నుండి తొలగించడం జరిగింది. ఇక పార్టీ నుండి బయటికి వచ్చిన పృథ్వీ ప్రస్తుతం జనసేన పార్టీలో కొనసాగుతున్నారు. తాజా రాజకీయ అంశాల గురించి అలాగే తన సినిమా జీవితం గురించి మాట్లాడారు.

అపుడు జగన్ ఇప్పుడు పవన్…
పృథ్వీ వైసీపీ నుండి బయటికి వచ్చాక జనసేనలో చేరి వైసీపీ గురించి తీవ్ర విమర్శలను చేస్తూ వచ్చారు. అవినీతి గురించి మాట్లాడుతున్నారు. వైసీపీ వాళ్లకు పవన్ ను అనడానికి మూడు పెళ్లిళ్ల మ్యాటర్ తప్ప వేరే ఏమీ కనిపించడం లేదని ఎపుడూ అదే విమర్శలు చేస్తున్నారంటూ చెప్పగా ఆయనకు ఇంటర్వ్యూలో వైసీపీ లో ఉన్నన్ని రోజులు జగన్ దేవుడు అన్నారు, ఇప్పుడు జనసేన కు రాగానే పవన్ దేవుడంటున్నారు అనే ప్రశ్న ఎదురైంది.

అయితే వెంటనే పృథ్వీ దానికి సమాధానం ఇస్తూ నాకంటే ముందు ఎంతో మంది జగన్ ను దేవుడు అన్నవాళ్లు ఉన్నారు. వాళ్లంతా ఇప్పుడు ఏమంటున్నారు అంటూ పరోక్షంగా వైసీపీ నుండి బయటికి వచ్చిన నేతలను గురించి మాట్లాడారు. ఇక మా అధినేత ఆదేశిస్తే చోడవరం నుండి ఎమ్మెల్యే కి పోటీచేస్తానని చెప్పారు. సొంతూరు తాడేపల్లి గూడెం అయినా కూడా అక్కడ జనసేన కు బలమైన సీనియర్ లీడర్ ఉండటం వల్ల నేను చోడవరం ఎంచుకుంటున్నట్లు తెలిపారు.