Comedian Pruthvi Raj : శ్యామ్ బాబు పాత్రతో బంపర్ ఆఫర్ కొట్టిన 30 ఇయర్స్ ఇండస్ట్రీ…!

0
124

Comedian Pruthvi Raj : థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనగానే పృథ్వీ రాజ్ గుర్తొస్తాడు. సినిమాల్లో ఎన్నో పాత్రలను చేసినా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ మాత్రం బాగా గుర్తింపు పొందింది. ఇక సినిమాల్లో కమెడియన్ గా కొనసాగుతూ రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఇక రాజకీయాల్లో వైసీపీ లో చేరి జగన్ తరుపున ప్రచారం చేసిన పృథ్వీ టీటీడీ లో ఎస్విబిసి చానెల్ కి చైర్మన్ గా పనిచేసారు. అయితే ఆ సమయంలో లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆ పదివి నుండి తొలగించడం జరిగింది. ఇక పార్టీ నుండి బయటికి వచ్చిన పృథ్వీ ప్రస్తుతం జనసేన పార్టీలో కొనసాగుతున్నారు. తాజాగా ‘బ్రో’ సినిమాలో ఆయన పాత్రకు మంచి క్రేజ్ వచ్చింది.

శ్యామ్ బాబు తో శోభన్ బాబు సినిమాలో ఛాన్స్…

రీసెంట్ గా వచ్చిన పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ సినిమా బ్రో. ఈ సినిమా అంతా ఒకెత్తయితే సినిమాలో శ్యాంబాబు క్యారెక్టర్ మరో ఎత్తు. కేవలం సినిమాలో 1 నిమిషం 5 సెకెండ్లు నిడివితో శ్యామ్ బాబు పాత్ర ఉన్నా ఆ క్యారెక్టర్ బాగా హైలైట్ అయింది. మీడియా అటెన్షన్ అంతా కూడా ఆ పాత్ర మీదే పడింది. దీంతో ఇపుడు అదే క్యారెక్టర్ ను ఫుల్ లెన్త్ లో వాడుకోవాలని శోభన్ బాబు సినిమా యూనిట్ అనుకుంటున్నారట.

అందుకే రాబోయే శోభన్ బాబు అనే సినిమాలో శ్యామ్ బాబు క్యారెక్టర్ దాదాపు రెండు గంటలపాటు సాగనుందట. ఈ విషయం పృథ్వీ తన పుట్టినరోజు సందర్భంగా ఒక సెల్ఫీ వీడియో ద్వారా తెలిపారు. తన కెరీర్ ను మలుపు తిప్పే పాత్రను శోభన్ బాబు సినిమాలో చేయనున్నట్లు పృథ్వీ తెలిపారు.