Comedian Pruthviraj : థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనగానే పృథ్వీ రాజ్ గుర్తొస్తాడు. సినిమాల్లో ఎన్నో పాత్రలను చేసినా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ మాత్రం బాగా గుర్తింపు పొందింది. ఇక సినిమాల్లో కమెడియన్ గా కొనసాగుతూ రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఇక రాజకీయాల్లో వైసీపీ లో చేరి జగన్ తరుపున ప్రచారం చేసిన పృథ్వీ టీటీడీ లో ఎస్విబిసి చానెల్ కి చైర్మన్ గా పనిచేసారు. అయితే ఆ సమయంలో లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆ పదివి నుండి తొలగించడం జరిగింది. ఇక పార్టీ నుండి బయటికి వచ్చిన పృథ్వీ ప్రస్తుతం జనసేన పార్టీలో కొనసాగుతున్నారు. తాజా రాజకీయ అంశాల గురించి అలాగే తన సినిమా జీవితం గురించి మాట్లాడారు.

దమ్ము ధైర్యం ఎందుకు, వీధి రౌడీలా ఏమైనా…
రోజా, పవన్ కళ్యాణ్ గురించి నిరంతరం విమర్శలు చేస్తూ ఉంటారు. అలా దమ్ము ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ ను 175 స్థానాలకు పోటీ చేయండి అంటూ రోజా సవాలు విసిరిన నేపథ్యంలో ఆ విమర్శలకు గురించి పృథ్వీ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ దమ్ము ధైర్యం గురించి రోజాకు ఎందుకు.

అయినా దమ్ము ధైర్యం ప్రదర్శించడానికి ఏమైనా కబడ్డీ కుస్తీ పోటీలు పెడుతున్నారా లేక వీధి రౌడీలా దమ్ము ధైర్యం ప్రదర్శించడానికి, ఎవరి బలం ఏంటో వారికి తెలుసు. పవన్ గారే చెప్తున్నారు క్లారిటీ గా ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తే ఎలా ఉంటుందని, ఆయన క్లారిటీ ఆయనకు ఉంది అంటూ పృథ్వీ కామెంట్స్ చేసారు.