Comedian Ramachandra : నాకు, జూనియర్ ఎన్టీఆర్ కి అదే మొదటి సినిమా… ఇంత పెద్ధ హీరో అవుతాడని అనుకోలేదు…: కమెడియన్ రామచంద్ర

0
35

Comedian Ramachandra : సినిమాల్లో కమెడియన్ గాను అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను వందకు పైగా సినిమాల్లో నటించి మంచి పేరు గుర్తింపు అందుకున్న నటుడు రామచంద్ర ఈ మధ్య కాలంలో వెనకబడ్డాడు. సినిమాల్లో 2016 నుండి కనిపించకపోవడానికి కారణాలను చెబుతూ అలాగే తన సినిమా కెరీర్ ఎలా మొదలయింది వంటి ఆసక్తికర విషయాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ అలా ఉంటాడని అనుకోలేదు…

రామచంద్ర సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండానే సినిమాల్లో ఎలాగైనా కనిపించాలనే ఉద్దేశంతో ప్రయత్నించాడు. అలా స్నేహితుడి ద్వారా ఒక డైరెక్టర్ పరిచయం అవడం అతను తీయాలని అనుకున్న సినిమా పోయినా ఉష కిరణ్ బ్యానర్ లో ఎన్టీఆర్ మొదటి సినిమా ‘నిన్ను చూడాలని’లో నటించే అవకాశం అందుకున్నాడు. అలా ఎన్టీఆర్ ఫ్రెండ్ గా నిన్నుచూడాలని సినిమాలో మొదటగా నటించిన రామ చంద్ర ఆ సినిమా విశేషాలను చెబుతూ ఎన్టీఆర్ గారి మనవడు హీరో అనగానే సెట్స్ లో ఎలా ఉంటాడో అనుకున్నాను కానీ రావడమే అందరినీ పలకరించి పరిచయం చేసుకుని చాలా సరదాగా మాట్లాడేవాడు.

ఇంత సింపుల్ గా ఉంటారా అనిపించింది ఎన్టీఆర్ ను చుస్తే. ఇక తాను మంచి హీరో అవుతాడని అనుకున్నాను కానీ ఇంత ఇమేజ్ వస్తుందని అనుకోలేదు. అయితే తాను చాలా కాన్ఫిడెంట్ గా ఉండేవాడు షూటింగ్ లో అంటూ ఎన్టీఆర్ తో వర్క్ ఎక్స్పీరియన్స్ చెప్పారు రామచంద్ర. ఇక 2016 లో ఒక చిన్న సినిమా షూటింగ్ సమయంలో కాలు ఫ్రాక్చర్ అవడంతో రెండేళ్లు విరామం తీసుకోవాల్సి వచ్చిందని ఆపైన కరోనా లాక్ డౌన్ వల్ల సినిమాలకు చాలా గ్యాప్ వచ్చిందని తెలిపారు.