Comedian Sudhakar : తన వాయిస్ మాడ్యులేషన్ తో విభిన్నమైన కామెడీతో ఆకట్టుకున్న కమెడియన్ సుధాకర్. మార్కాపురం కి చెందిన సుధాకర్ గారు చెన్నై వెళ్లి సినిమాల్లో ప్రయత్నించారు. చిరంజీవి, హరిప్రసాద్, ఈయన ముగ్గురూ రూమ్మేట్స్ కాగా మొదట తమిళ సినిమా రాధిక హీరోయిన్ గా అవకాశం వచ్చింది. ఇక ఆయన మొదట తమిళంలో హీరోగా బాగా ఫేమస్ అయినా తెలుగులో కమెడియన్ గా మారారు. 90వ దశకం నాటికి కమెడియన్ గా స్టార్ డమ్ తెచ్చుకున్నారు సుధాకర్. ఇక ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆయన మీద యూట్యూబ్ లో వస్తున్న రూమర్స్ మీద స్పందించారు.

నన్ను చంపకండి బతికే ఉన్నా…
సుధాకర్ గారు ఫాదర్స్ డే సందర్బంగా ఒక ఇంటర్వ్యూలో కొడుకుతో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను చెబుతూ సోషల్ మీడియాలో తాను అనారోగ్యంతో బాధపడుతున్నట్లు, మరణించినట్లు వార్తలు వస్తున్నాయి, సాధారణంగా ఎలాంటి రూమర్స్ వచ్చినా పెద్దగా పట్టించుకోను కానీ చనిపోయినట్లు వస్తున్న వార్తల గురించి విన్నప్పుడు బాధగా అనిపించింది.

బ్రతికే ఉన్నాను అని నేనే చెప్పాల్సి వస్తోంది. చనిపోయానని అపద్దపు ప్రచారంలో నాకు మంచిది కాదు, వాళ్లకు మంచిది కాదు కదా అంటూ చెప్పారు. ఇక అయన కొడుకు బెన్నీ ని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. చాలా హ్యాపీగా ఉన్నట్లు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు.



































