Comedian Yadamma Raju : ఈటీవీ లో ప్రసారమైన స్టాండ్ అప్ కామెడీ షో పటాస్ ద్వారా బాగా ఫేమస్ అయిన యాదమ్మ రాజు ఆ తరువాత జబర్దస్త్ కు మారాడు. మంచి టైమింగ్ తో సద్దాం టీంతో టాలెంట్ ప్రూవ్ చేసుకున్న యాదమ్మ రాజు మధ్యలో జీ తెలుగు, మా టీవీ లలోను కామెడీ షోస్ చేసినా చివరకు ఈటీవీ జబర్దస్త్ కు వచ్చేసాడు. ఇక తన ప్రేయసిని ఇటీవలే పెళ్లి చేసుకున్న యాదమ్మ రాజు తాజాగా స్లమ్ డాగ్ హస్బెండ్ సినిమా ప్రొమోషన్స్ కోసం ఇంటర్వ్యూలో పాల్గొనగా అందులో కాలుకి కట్టుతో కర్ర సహాయంతో నడుస్తూ కనిపించాడు.

యాక్సిడెంట్ లో కాలి వేలు తొలగించారు…
యాదమ్మ రాజుకి ఆక్సిడెంట్ అయినా ప్రమోషన్స్ కోసం రాగా అసలు యాక్సిడెంట్ ఎలా అయిందనే విషయం తెలిసింది. టీ తాగడానికి బయటికి షాప్ దగ్గరికి వెళ్లగా సమీపంలో ఒక బైక్ స్కిడ్ అయి కాలు మీద పడటంతో వేలు విరిగిందట. దీంతో హాస్పిటల్ కి వెళితే కాలి చివరి చిటికిన వేలు తొలగించి తొడ దగ్గర కొంత కట్ చేసి కాలికి వేశారని నడవడానికి కష్టంగా ఉందని యాదమ్మ రాజు తెలిపారు.

ఇక హాస్పిటల్ లో యాదమ్మ రాజు ఉన్నపుడు ఆయన భార్య స్టెల్లా ఎమోషనల్ వీడియోను యూట్యూబ్ లో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం పలు సినిమా అవకాశలతో బిజీగా ఉన్న యాదమ్మ రాజుకి కాలు విరగడంతో ఇబ్బంది పడుతున్నారు. తాను త్వరగా కోలుకోవాలని నెటిజన్స్ కోరుకుంటున్నారు.




























