జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమా షూటింగ్ లతో బిజీబిజీగా ఉన్నాడు. అతని కెరీర్ గ్రాఫ్ కూడా ప్రస్తుతం టాప్ రేంజ్ లో ఉంది. వరస విజయాలతో దూసుకుపోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. రాజమౌళితో పాటు టాప్ దర్శకులందరూ తారక్ కాల్షీట్లు కోసం పడిగాపులు కాస్తున్నారు.

ఇలాంటి టైంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై సోషల్ మీడియాలో మళ్లీ రూమర్స్ వినిపిస్తున్నాయి. తారక్ మళ్లీ పాలిటిక్స్‌లోకి వస్తేనే బాగుంటుందని చాలా మంది టీడీపీ నాయకులు కూడా తమ అభిప్రాయాలను తెలియ జేస్తున్నారు. తారక్ పాలిటిక్స్ లోకి వస్తేనే కానీ తెలుగుదేశం పార్టీకి మంచి రోజులు రావంటూ కొందరు సీనియర్ నేతలు జోస్యం చెబుతున్నారు. కానీ లోకేష్, బాలయ్య లాంటి వాళ్లు మాత్రం తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదని తెలపడం కొంచెం ఆశ్చర్యకరమైన విషయం. ఇదిలా వుండగా తాజాగా సీనియర్ కమెడియన్ పృథ్వీరాజ్ సంచలనమైన కామెంట్స్ చేసాడు.

ఈ టైంలో తారక్ అవసరం ఏమీలేదని తేల్చి చెప్పేశాడు పృథ్వీ. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని బాగానే పరి పాలిస్తున్నారని, ఇలాంటి టైంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నాడు ఫృధ్వీ. తారక్ ప్రస్తుతం రాజకీయాల కన్నా సినిమా రంగానికే ఎక్కువ అవసరమని.. ఆయన అక్కడుండటమే మంచిదని, తారక్ సినీ భవిష్యత్తు ప్రస్తుతం అద్భుతంగా ఉందని.. రాజకీయాల్లోకి ఆయన ఇప్పుడప్పడే రానవసరం లేదని, 55 ఏళ్లు దాటిన తర్వాత తారక్ సరికొత్త ఎజెండాతో రాజకీయ ప్రవేశిస్తే చాలా బాగుంటుందని అభిప్రాయ పడ్డాడు కమెడియన్ ఫృధ్వీ రాజ్. ఈయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలై రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here